Traffic Awareness Program: రూల్స్ పాటిద్దాం ప్రాణాలు కాపాడుదాం.. రోడ్డు ప్రమాదాలపై విద్యార్ధుల వినూత్న కార్యక్రమం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

Traffic Awareness Program: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అతివేగంగా వాహనాలు నడుపుతూ ఎదుటి వాళ్ల ప్రాణాలు కొందరు తీస్తుంటే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా మరికొందరు ప్రమాదాల్ని కొనితెచ్చుకుంటున్నారు.

Rapid Read
+

రోడ్డు

రోడ్డు ప్రమాదాల నివారించేందుకు విద్యార్థుల విన్నోతా కార్యక్రమం

Traffic Awareness Program: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అతివేగంగా వాహనాలు నడుపుతూ ఎదుటి వాళ్ల ప్రాణాలు కొందరు తీస్తుంటే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా మరికొందరు ప్రమాదాల్ని కొనితెచ్చుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి, పౌరుల్లో ట్రాఫిక్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికి పరివర్తన రావడం లేదు. అందుకే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విద్యార్థులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో యువత జాగ్రత్తలు తీసుకోవాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రభుత్వం సూచిస్తున్న సూచనలు పాటించాలని విద్యార్థులు ఒక సంఖ్య మాదిరిగా మానవహారం నిర్వహించారు. ఓ స్కూలుకు సంబంధించిన వేలాదిమంది విద్యార్థులు ఆకట్టుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు.

వినూత్న సందేశం..

రోడ్డు ప్రమాదాలు ప్రాణాలు తీస్తుంటే.. నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం మరికొన్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అందుకే వాహనాలు నడిపే వాళ్లు బాధ్యతగా నడుచుకోవాలని.. మన ప్రాణాలతో పాటు ఎదుటి వారి శ్రేయస్సు కోసం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సందేశమిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం సర్వరాయ ఉన్నత పాఠశాలలో వందలాదిగా విద్యార్థులు వెరైటీ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇది 2026 సంవత్సరం కాబట్టి ఈ ఏడాదిలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని కోరుతూ 2026 నంబర్‌‌ వచ్చేలా విద్యార్ధులు ఒక వరుస క్రమంలో నిలబడి మంచి మెసేజ్ ఇచ్చారు. 2025వ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఎన్నో దుర్ఘటనలు, నిర్లక్ష్య సంఘటనలు లక్షలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయని.. కనీసం ఈ ఏడాదిలో అయినా అలాంటివి జరగకుండా ఉండాలని కాంక్షిస్తూ సంఖ్యల రూపంలో లైన్ కట్టి అందరినీ ఆకట్టుకున్నారు. సర్వరాయ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంగ శ్రీనివాస్, ఇతర ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.

సమాజహితం కోరుతూ..

సమాజంలో ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలంటూ విద్యార్థులు పిలుపునిచ్చారు. ముఖ్యంగా నూతన సంవత్సరంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చూపిస్తున్న జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. హెల్మెట్ ధరించాలని, సెల్ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని, మద్యం సేవించరాదని విద్యార్థులు పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో ఒక లైన్ మాదిరిగా 2026 ఆకారాన్ని అందరూ చూస్తుండగా లైవ్ లో అద్భుతంగా తీసుకువచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణంలో విద్యార్థులంతా ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు.

రోడ్డు ప్రమాదాలపై అవగాహన..

ఇలాంటి కార్యక్రమం చేపట్టిన విద్యార్థులను ప్రత్యేకంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వంగ శ్రీనివాస్ తో పాటు ఇతర ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అన్నిటికీ చదువే ప్రధానమని, చదువు తర్వాతే ఏదైనా అంటూ ఉపాధ్యాయులు సైతం ప్రత్యేకంగా ప్రసంగించారు. గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు చూస్తుండగానే లైవ్ లో ఈ అంకె రూపాన్ని తీసుకురావడం మరల విడిపోవడం లాంటి లైవ్ వీడియో విద్యార్థుల స్పూర్తిని తెలియజేసింది. విద్యార్ధులు చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యతను కూడా చిన్నప్పటి నుంచే పెంచుకోవాలని సూచించారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకున్నారు గ్రామస్తులు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *