హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు రెడ్, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2026 డిసెంబర్‌లోపు నగరంలోని డీజిల్ బస్సులను తొలగించి 100% ఏసీ ఈవీ బస్సులు ప్రవేశపెడతామని, విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలని యోచిస్తున్నామని చెప్పారు.
గాంధీ విగ్రహ నిర్మాణానికి రూ.500 కోట్లు కాదు, రూ.70 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని స్పష్టం చేశారు.
మహిళా దినోత్సవం రోజే కాదు, ప్రతిరోజూ మహిళలను గౌరవించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.జాగృతి కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ‘గివ్ హర్ స్పేస్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.పెద్ద-చిన్న కులం అనే తేడా లేకుండా మహిళలంతా ఒకే కులమని, తెలంగాణ ఉద్యమం నుంచి సామాజిక తెలంగాణ సాధన వరకు వారి పాత్ర కీలకమని చెప్పారు.మహిళలు ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు పెరిగాయని విమర్శిస్తూ 33% రిజర్వేషన్ కోసం జాగృతి పోరాటం చరిత్ర సృష్టించిందన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రపతిని స్వాగతించేందుకు సీఎం, ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఎందుకు రాలేదని, వాష్‌రూమ్‌లో నీళ్లు లేకపోవడం, కాన్వాయ్ మార్గం చెత్తతో ఉండడంపై ప్రశ్నించింది. డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్, సిలిగుడి పోలీస్ కమిషనర్ సహా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కోరింది.
భారత్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ దిల్లీలో జరిగిన రైసినా డైలాగ్‌లో తెలిపారు.అమెరికా వ్యాఖ్యలకు స్పందిస్తూ, భారత్ తన బలాలపై ఆధారపడి స్వయంగా అభివృద్ధి దిశను నిర్ణయించుకుంటుందని చెప్పారు.సాంకేతిక సమస్యలతో కొచ్చిన్‌లో నిలిపిన ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్-లావన్‌కు మానవతా దృక్పథంతో భారత్ ఆశ్రయం ఇచ్చినట్లు తెలిపారు.భవిష్యత్తులో ప్రపంచం బహుళ ధ్రువ వ్యవస్థగా మారుతుందని, ఏ దేశం కూడా అన్ని రంగాల్లో పూర్తి ఆధిపత్యం సాధించలేదని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ పాటించలేదని కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. ముర్ము పాల్గొనే కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని ప్రధాని మోదీ ఆరోపిస్తూ, ఇది రాష్ట్రపతితో పాటు రాజ్యాంగానికి అవమానమని టీఎంసీపై మండిపడ్డారు. మురికి రాజకీయాలు చేస్తున్న తృణమూల్‌కు బెంగాల్ ప్రజలు త్వరలోనే తగిన సమాధానం ఇస్తారని, ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తోందని సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ, రాష్ట్రపతి పాల్గొననున్న విషయంపై ముందస్తు సమాచారం లేదని తెలిపారు.
టాలీవుడ్ నటుడు బెల్లకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన కీర్తి రెడ్డితో ఆయన నిశ్యితార్థం జరిగింది. ఈ వేడుక ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరయ్యారు. ఇక కీర్తి రెడ్డి తండ్రి లాయర్ కాగా, తాత జడ్జీ అని టాలీవుడ్ సమాచారం.
మహేష్ బాబు-ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దాదాపు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమౌవుతున్న ఈ సినిమలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ రూ.160 కోట్లకు అమ్ముడైనట్లు టాలీవుడ్లో గుసుగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే వారణాసి సినిమా సరికొత్త రికార్డు సృష్టించినట్లే. ఈ సినిమా ఏప్రిల్ 7,2027లో రిలీజ్ కాబోతుంది..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధంపై విస్తుపోయే నిజాలను వెల్లడించారు. ఫ్లోరిడాలోని డోరల్లో జరిగిన ‘షీల్డ్ ఆఫ్ ది అమెరికాస్’ (Shield of the Americas) సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన, కేవలం 72 గంటల్లోనే అమెరికా దళాలు ఇరాన్ నావికాదళానికి చెందిన 42 యుద్ధ నౌకలను సముద్ర గర్భంలో కలిపేశాయని ప్రకటించారు.
ఫ్రాన్స్ దేశాన్ని భారీ వరదలు వణికిస్తున్నాయి. గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పశ్చిమ ఫ్రాన్స్‌లోని అనేక పట్టణాలు జలమయమయ్యాయి.భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం.
అమెరికా రాజధాని వాషింగ్టన్ DC మరియు న్యూయార్క్ నగరాల్లో యుద్ధానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. తమ దేశం యుద్ధంలో పాల్గొనడం వల్ల ఆర్థికంగా మరియు ప్రాణనష్టం జరుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.


