TOP News: ఈరోజు టాప్ టెన్ వార్తలు ఇప్పుడు చూడండి.. తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు ప్రపంచ వార్తలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


సీఎం రేవంత్‌ రెడ్డి శాసనసభలో కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా కోట్లు దోచుకునట్లు విమర్శించారు. ఆ కేసును సీబీఐకు విచారణ అప్పగించామని, ఐతే కేంద్రం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎందుకని సీఎం ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ కేసుపై ఆందోళన చేశారు రేవంత్.

2. ‘తల్లిదండ్రుల సంరక్షణ’ బిల్లు

తెలంగాణ శాసనసభ తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత బిల్లును ఆమోదించింది. సీఎం రేవంత్‌రెడ్డి వృద్ధ తల్లిదండ్రులకు పిల్లలు అండగా ఉండడం, చట్టం సమాజంలో బాధ్యతను పెంపొందిస్తుందని చెప్పారు. తల్లిదండ్రులను చూసుకోని వ్యక్తిని సమాజం బహిష్కరించాలి. ఈ చట్టం ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రజా ప్రతినిధులకూ వర్తిస్తుందని చెప్పారు.

3. రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్

హరీష్ రావు రేవంత్ రెడ్డి తనపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిస్పందిస్తూ, తన కుటుంబంపై ఆరోపణలు చేసినట్లయితే హౌస్ కమిటీ ఏర్పాటు చేసి విచారించమని, రేవంత్ రెడ్డి సోదరులు, ఆయన బావమరిది సృజన్ రెడ్డి చేసిన అక్రమాలపై కూడా హౌస్ కమిటీ వేయడానికి సిద్దమైతే తాను కూడా విచారణకు సిద్దమేనని అన్నారు.

4. ఏ ఎన్నికలు జరిగినా విజయం తెదేపాదే కావాలి

తెలుగుదేశం పార్టీ (TDP) 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, తెదేపా కార్యకర్తలు చేసిన త్యాగాలను గుర్తించాలని వాటిని మరవకూడదన్నారు. ఎన్ని సంక్షోభాలు వచ్చినా తెదేపా గెలవాలనే తీరును మనం పాటించాలని, రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములు పార్టీపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. పార్టీ బలంగా ఉంటే రాష్ట్రం బలంగా ఉంటుంది; పార్టీ విజయంమే రాష్ట్ర విజయమనిఅన్నారు.

5. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు..

ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ యుద్ధాలు, ఇంధన సంక్షోభంపై చర్చించారు. తప్పుడు ప్రచారాలను నమ్మకూడదన్నారు. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులకు ప్రభుత్వ సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంధన సరఫరాలో ఉద్రిక్తతలు, పెట్రోల్-డీజిల్ సంక్షోభం ఉందని, ప్రజలు ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు.

6. ‘ధురంధర్‌’ ఆదాయంలో మాకూ కొంత ఇవ్వాలి

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఆదిత్యధర్‌ తెరకెక్కించిన స్పై యాక్షన్‌ చిత్రం ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కరాచీ ల్యారీ నేపథ్యంగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ కథతో రూపొందిన ఈ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ చిత్ర విజయం నేపథ్యంలో ల్యారీ వాసులు ‘ధురంధర్‌2’ ఆదాయంలో కొంత భాగాన్ని తమ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.

7. నేటి సినిమాల్లో మజా లేదు

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ వీఎఫ్‌ఎక్స్‌ మరియు ఏఐ సహాయం లేకుండా నిజమైన యాక్షన్‌ సినిమా చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుత యాక్షన్‌ సన్నివేశాలు వాస్తవికతకు దూరంగా, కృత్రిమంగా ఉంటాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయన స్వయంగా ఫైట్‌ సీన్స్‌ చేసి, నిజమైన యాక్షన్‌ చూపించాలనుకుంటున్నారని తెలిపారు.

8. శ్రీలంకకు భారత్‌ సాయం

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభంలో భారత్‌ శ్రీలంకకు 38వేల మెట్రిక్‌ టన్నుల పెట్రోల్, డీజిల్ అత్యవసర సహాయం అందించింది. కొలంబో నౌకాశ్రయంలో సరఫరా చేరింది, శ్రీలంక ప్రభుత్వం భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

9. అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా న్యూయార్క్ నగరంలో మూడవసారి “నో కింగ్స్” ర్యాలీ జరిగింది. ఇరాన్ యుద్ధం మరియు దేశీయ రాజకీయాల్లో ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ వేలాది మంది పౌరులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఐరోపాలోని కూడా లండన్‌, ప్యారిస్‌, రోమ్‌లో ట్రంప్‌ విధానాలపై నిరసనలు జరిగాయి.

10. రష్యా చమురు.. పోర్టును దెబ్బతీసిన ఉక్రెయిన్‌

రష్యా చమురు ఎగుమతులలో కీలకమైన ఉస్త్‌ పోర్టును ఉక్రెయిన్‌ డ్రోన్లు తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ దెబ్బతో పోర్టు నుండి ఎగుమతులు పూర్తిగా నిలిపివేయబడ్డాయి. ప్రిమోర్స్క్‌ పోర్టు కూడా దాడిలో దెబ్బతినింది, అంతేకాకుండా ఉక్రెయిన్‌ ఈ నెలలో 10 ఇంధన సంస్థలపై దాడులు చేసింది, దీంన్తో రష్యా చమురు ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *