పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ పోరులో, ముడి చమురు ధర బ్యారెల్‌కు 200 డాలర్లకు చేరుతుందన్న ఇరాన్ హెచ్చరికలతో ప్రపంచ దేశాలు అత్యవసర చమురు నిల్వలను బయటకు తీసేందుకు సిద్ధమవుతున్నాయి.
భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం రామనామ స్మరణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించగా, ఇదే తరుణంలో రూ. 351 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయడం విశేషం.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సరికొత్త రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. శ్రీరామనవమి పర్వదినాన పార్టీ ఏర్పాటును ప్రకటిస్తూ, ఏప్రిల్ 25న మేడ్చల్ వేదికగా యువత, మహిళలకు పెద్దపీట వేసేలా నూతన పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు.
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా సీతారాంబాగ్‌లో శ్రీ రామనవమి భారీ శోభాయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రాత్రి వరకు కొనసాగనున్న ఈ కన్నుల పండువ వేడుకకు పోటెత్తిన భక్తుల కోసం పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత జరిగిన మూడో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటగా, స్వామివారి నుదిటిపై ప్రకాశించిన అద్భుత ‘సూర్య తిలకం’ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. ఈ విశేష పర్వదినం సందర్భంగా దేశవిదేశాల నుంచి పోటెత్తిన లక్షలాది మంది భక్తులతో అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.
ర్యాపర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి రాజకీయాల్లో సంచలనం సృష్టించిన 35 ఏళ్ల బాలెన్ షా, నేపాల్ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరికొత్త చరిత్ర లిఖించారు. మార్చి 5న జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని ఓలీని ఓడించడమే కాకుండా, ‘జెన్-జీ’ (Gen-Z) ఓటర్ల ప్రభంజనంతో 182 స్థానాలను గెలుచుకున్న ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
టెహ్రాన్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయ సమీపంలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులపై పాక్ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ, తమ దౌత్యవేత్తలకు హాని జరిగితే సహించేది లేదని హెచ్చరించింది. ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసమైనప్పటికీ దౌత్య సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలుపుతూ, తమ దేశం ఖతార్ వంటిది కాదని ఇజ్రాయెల్‌కు పాక్ ఘాటుగా బదులిచ్చింది.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పెద్ది’ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేయగా, అందులోని పవర్‌ఫుల్ డైలాగులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ హై-వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామాను ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది.
తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు హీరోయిన్ సాయి పల్లవి ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రస్తుతం తన పూర్తి దృష్టి కేవలం కెరీర్‌పైనే ఉందని స్పష్టం చేసింది. బాలీవుడ్ ఎంట్రీతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానంది. పెళ్లి గురించి ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదని తేల్చి చెప్పారు.
జియో స్టూడియోస్ నిర్మించిన ‘ధురంధర్-2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. విడుదలైన 8 రోజుల్లోనే రూ. 1088 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అత్యంత వేగంగా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా నిలిచింది. ఇందులో భారత్‌లోనే రూ. 814 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 274 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ సినీ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.


