Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు


నిమ్మల రామానాయుడు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంగా ఉన్నాయని ఆరోపించారు. అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులు ఆపేస్తామని అంటున్నారని, హింసాత్మక వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల రవి నుంచి వివేకా హత్య వరకు సాక్షుల మరణాలపై ప్రశ్నలు లేవనెత్తారు. రంగా హత్య కేసు, డ్రగ్స్ అంశాలను ప్రస్తావిస్తూ ఈ అంశాలు యువతపై ప్రభావం చూపుతుందని ఆరోపించారు.

2.ఆకాంక్షలకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రతీక

బండి సంజయ్ కుమార్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. 33 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మకమని, మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని తెలిపారు. ‘నారీశక్తి వందన్ అధినియం’ను పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టి 2029 ఎన్నికల ముందే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.

3.ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి..

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలై ప్రథమ సంవత్సరంలో 66.2 శాతం, ద్వితీయ సంవత్సరంలో 70.58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు ఇరు సంవత్సరాల్లో బాలుర కంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించి పైచేయి చూపారు. ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. మే 13 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రెండు సెషన్లలో ప్రారంభమవుతాయి. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఏప్రిల్ 13–20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

4.రామాలయ నిర్మాణం పరిపూర్ణం

అయోధ్యలోని రామ మందిరం అయోధ్య నిర్మాణం రూ.1,800 కోట్ల వ్యయంతో పూర్తైనట్లు కమిటీ ప్రకటించింది. చైర్మన్ నృపేంద్ర మిశ్ర వివరాల ప్రకారం 2020లో పనులు అధికారికంగా ప్రారంభమై ఇప్పుడు ముగిశాయి. తాత్కాలిక స్థలంలో ఉన్న రామ్ లల్లా విగ్రహం ప్రాంతాన్ని సురక్షితంగా మార్చి అఖండ జ్యోతి ఏర్పాటు చేశారు.

5.ఆశా భోంస్లే ఇకలేరు

ఆశా భోంస్లే ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో మరణించారు. 1933లో జన్మించిన ఆమె వేల పాటలతో భారత సంగీతానికి చిరస్మరణీయ సేవలందించి పద్మ విభూషణ్ వంటి పురస్కారాలు అందుకున్నారు. ఆమె అంత్యక్రియలు ముంబయిలోని శివాజీ పార్క్‌లో నిర్వహించనుండగా సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

6.మీడియాపై అనసూయ ఫైర్

నటుడు శివాజీ వ్యాఖ్యలతో ప్రారంభమైన వస్త్రధారణ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. యాంకర్ అనసూయ భరద్వాజ్ తన భర్తతో కలిసి పట్టుచీరలో ఉన్న వీడియోపై ఓ న్యూస్ ఛానల్ పెట్టిన వ్యాఖ్యపై తీవ్రంగా స్పందించారు. ఆ క్యాప్షన్‌ను వ్యంగ్యంగా ఖండిస్తూ, చీరను శివాజీ సృష్టించారన్నట్టుగా వ్యాఖ్యలు ఉండాలని సెటైర్ చేశారు. అనసూయ ఆమె కామెంట్ సెక్షన్‌ను లాక్ చేశారు. దీంతో నెటిజన్లు స్పందించే అవకాశం లేకుండా పోయింది.

7.జన నాయగన్’ లీక్‌తో మాకు సంబంధం లేద

సెన్సార్ బోర్డ్ ( Central Board of Film Certification) ‘జన నాయగన్’ లీకేజీలో తమ పాత్ర లేదని స్పష్టం చేసింది. డీసీపీని మార్చి 17న నిర్మాతలకు ఇచ్చామని, కంటెంట్ పాస్‌వర్డ్ రక్షణలో ఉందని తెలిపింది. లీక్ ఘటనను సినీ ప్రముఖులు ఖండించగా, షేర్ చేయడం చట్టవిరుద్ధమని చిత్రబృందం హెచ్చరించింది.

8.నాపై అసత్య ప్రచారం

మంగ్లీపై మైక్రోఫైనాన్స్ మోసం ఆరోపణలను ఆమె ఖండిస్తూ, అవి ప్రతిష్ఠ దెబ్బతీయడానికే తప్పుడు కేసు పెట్టారని తెలిపారు గాయని మంగ్లీ. న్యాయవాది సుబ్బారావుపై తానే ముందుగా ఫిర్యాదు చేశానని, వైరల్ డబ్బు తనదికాదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై చట్టపరంగా పోరాడతానని,ఈ తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని ఆమె కోరారు.

9. చైనాకు ట్రంప్‌ వార్నింగ్‌

డొనాల్డ్ ట్రంప్ చైనా ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించగా, చైనా ఈ ఆరోపణలను ఖండించింది. ఇరాన్ రక్షణ సామర్థ్యాలను పునర్నిర్మించుకుంటుండగా, చైనా నుంచి క్షిపణి వ్యవస్థలు సరఫరా అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.ఇదే సమయంలో ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై చైనాను ట్రంప్ హెచ్చరించారు. ఒకవేళ చైనా గనుక ఇరాన్‌కు అండగా నిలిస్తే “పెద్ద సమస్యలు” ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

10.చర్చలు ఫెయిల్! ఇక యుద్ధమే.?

ఇరాన్ మరియు అమెరికా మధ్య ఇస్లామాబాద్‌లో జరిగిన కీలక చర్చలు ఎటువంటి నిర్ణయం లేకుండానే ముగిశాయి. సుదీర్ఘంగా 21 గంటల పాటు సాగిన ఈ చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. “ఇరాన్ మా నిబంధనలను అంగీకరించలేదు, అందుకే ఎటువంటి డీల్ కుదరలేదు” అని ఆయన స్పష్టం చేశారు. ఇస్మాయిల్ బఘాయీ ప్రకారం, ఇరుదేశాల మధ్య అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది.

అయితే రెండు కీలక అంశాలపై విభేదాలు రావడంతో ఒప్పందం నిలిచిపోయింది. ఆ అంశాలను స్పష్టం చేయకపోయినా, హర్మూజ్ జలసంధి మరియు అణు హక్కుల వివాదమే కారణమని సమాచారం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *