Top 10 News: ఈరోజు టాప్ టెన్ వార్తలు.. ప్రపంచ నలుమూలల జరిగిన వార్తలు మీ కోసమే | ఆంధ్రప్రదేశ్ వార్తలు


కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు, ఈ నెల 25న రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. గత 20 నెలలుగా పార్టీలో అవమానాలు, మానసిక క్షోభ ఎదుర్కొంటున్నానని ఈ మేరకు జగిత్యాల జిల్లాకు చెందిన తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలకు ఆయన ఒక లేఖ రాశారు. ఆయన తదుపరి అడుగు ఏ పార్టీలోనన్నదిపై జగిత్యాలలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.

2.అమరావతి దాసులు 20 ఏళ్లు ఎక్కువ జీవిస్తారు

నారా చంద్రబాబు నాయుడు ఏపీ అభివృద్ధి రేటును 15 శాతానికి పెంచడమే లక్ష్యమని, అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో తాను చేసిన కృషిని గుర్తుచేస్తూ, విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రానుందని, గ్రీన్ ఎనర్జీ, ఆక్వాకల్చర్ రంగాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 2019-24లో అభివృద్ధి మందగించిందని, ఇక రాష్ట్రాన్ని వేగంగా ప్రగతి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు.

3. మోదీ సర్కార్‌‌వి డొల్ల మాటలు

రాహుల్ గాంధీ రూపాయి పతనం, ఇంధన ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని హెచ్చరించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం స్పష్టమైన ఆర్థిక వ్యూహం లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. రూపాయి డాలర్‌తో పోలిస్తే రూ.100 వైపు పడిపోతుందని, ఎంఎస్‌ఎంఈలు, సాధారణ ప్రజలు తీవ్ర ప్రభావం ఎదుర్కొంటారని, పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ధరలు ఎన్నికల తర్వాత పెరిగే అవకాశముందని తెలిపారు.

4. దేశ రక్షణకై సిద్ధంగా ఉండండి

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధునిక యుద్ధం సరిహద్దులను దాటి ఆర్థిక, డిజిటల్, ఇంధన, ఆహార భద్రతల వరకు విస్తరించిందని పేర్కొన్నారు.ఈ భద్రతా రంగాల ద్వారా దేశాలు ఒకదానిని మరొకటి బలహీనపరచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.దేశ రక్షణ కోసం ప్రతి పౌరుడు సిద్ధంగా ఉండాలని, యువత క్రమశిక్షణతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

5. మోదీ రికార్డు

నరేంద్ర మోదీ 8,931 రోజులు నిరంతరంగా ప్రభుత్వ అధిపతిగా పనిచేసి అరుదైన రికార్డు సాధించి పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును అధిగమించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం 2014 నుంచి ప్రధానిగా కొనసాగుతోంది. 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును సమం చేశారు.అలాగే వరుసగా ఎక్కువకాలం పనిచేసిన ప్రధానుల్లో ఇందిరా గాంధీ రికార్డును అధిగమించి రెండో స్థానంలో నిలిచారు.

6. మోదీకి నేను ‘అంధభక్తురాలిని’

నటి రేణు దేశాయ్ ‘ధురంధర్ ది రివెంజ్’ సినిమా చూసిన తర్వాత నరేంద్ర మోదీ, బీజేపీపై ప్రశంసలు కురిపిస్తూ తాను మోదీకి సగర్వ అంధభక్తురాలని తెలిపారు. రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ చిత్రంలో ‘చాయ్‌వాలా’ డైలాగ్‌ను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. సైన్యం, నిఘా సంస్థల పట్ల గౌరవం ఉన్నవారు ఈ సినిమా చూడాలని సూచించారు.

7. రూ.2 కోట్లు మోసపోయిన కన్నడ నటి

కన్నడ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఉగాండా ఏజెంట్ చేతిలో రూ.2 కోట్లు మోసపోయిన విషయం ఈడీ విచారణలో బయటపడింది. తర్వాత దుబాయ్ నుంచి బంగారం అక్రమంగా భారత్‌కు తరలిస్తూ ఏడాదిలో 15 సార్లు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు.ఈ సమయంలో సుమారు 127 కిలోల బంగారం, రూ.102 కోట్ల విలువైన స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె బెంగళూరు జైలులో ఉండగా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆమెపై రూ.102 కోట్లకు పైగా జరిమానా విధించింది.

8. ధురంధర్‌ వసూళ్ల దూకుడు

ధురంధర్ 2 ది రివెంజ్లో రణ్‌వీర్ సింగ్ నటనకు భారీ ప్రశంసలు లభిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇప్పటికే సుమారు రూ.330 కోట్లు వసూలు చేసి పుష్ప 2 ఓపెనింగ్ రికార్డుకు చేరువైంది.తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 14వేలకుపైగా షోలతో 74 శాతం ఆక్యుపెన్సీ నమోదు అవుతోంది.

9.దిల్లీ, ముంబయిపై బాంబులేస్తాం: పాక్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య, పాకిస్థాన్ మాజీ రాయబారి అబ్దుల్ బాసిత్ భారత్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌ నుంచి తమ దేశానికి ఏదైనా ముప్పు వాటిల్లితే.. మరో ఆలోచన లేకుండా దిల్లీ, ముంబయి నగరాలపై బాంబులు వేస్తామంటూ నోరుపారేసుకున్నారు.ఈ యన బాసిత్‌ 2014–2017 వరకు భారత్‌లో పాక్‌ దౌత్యవేత్తగా ఉన్నారు.

భారత్‌ దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు.

10. ట్రంప్‌ నుంచి గ్రీన్‌లాండ్‌ను మేం కాపాడతాం

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని చేసిన ప్రయత్నాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అధికారి, అవసరమైతే గ్రీన్‌లాండ్‌ను ట్రంప్ నుంచి రక్షించేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు.అయితే డెన్మార్క్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *