Today Top 10 News: వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం?.. మంత్రి సంచలన కామెంట్స్ | తెలంగాణ వార్తలు


మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేటీఆర్ ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించగా, కేసీఆర్‌తో తనకు ఉన్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు జీవన్ రెడ్డి. కేటీఆర్ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో అవమానాలు తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నానని జీవన్ రెడ్డి వెల్లడించారు.

2.అవినీతి జరిగిందని సీఎం చెప్పారు

బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు, మంత్రి పొంగులేటి కంపెనీలో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని అన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు అనుమతులు లేకుండా నడుస్తున్నందుకు అధికారులు మూడుసార్లు నోటీసులు ఇచ్చారని తెలిపారు. సీఎం వ్యాఖ్యలపై పొంగులేటి సభలో స్పందించలేదని ప్రశ్నిస్తూ, ఆయనపై విమర్శలు చేశారు. నాదర్‌గుల్ భూముల విషయంలో ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, హైడ్రా పేదలపైనే చర్యలు తీసుకుంటుందా అని నిలదీశారు.

3.జగన్ మావిగన్‌ జోకర్‌గా మిగిలారు

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, జగన్ కేవలం వైయస్సార్ పేరును మాత్రమే ఉపయోగించాడని, వైఎస్‌ఆర్ ఆశయాలకు వారసు కాలేదని విమర్శించారు. తాము వాగ్దానం చేసిన పథకాలు, మద్యపాన నిషేధం, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసారని, భాజపాకి దత్తపుత్రుడి పుంజుగా మారి మౌనంగా ఉన్నారేంటని ప్రశ్నించారు. మూడురాజధానుల పేరుతో రుషికొండను స్వాధీనం చేసి, ప్యాలెస్‌లు నిర్మించి, ఇప్పుడు ‘మావిగన్ జోకర్’గా మిగిలాడని వ్యాఖ్యానించారు.

4.వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం?

మంత్రి అచ్చెన్నాయుడు, వైఎస్సార్ మరణ సమయంలో జగన్ ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆచూకీ తెలియని సమయంలోనే సీఎం పదవి కోసం సంతకాల సేకరణపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తండ్రి మరణాన్ని సానుభూతిగా మార్చుకుని రాజకీయ లాభం పొందారని ఆరోపించారు. జగన్ ప్రవర్తనను తప్పుబడుతూ, ఇది బాధ్యతారాహిత్యంగా ఉందని అన్నారు.

5.ఇల్లు, భూమి, కారు ఏదీ లేదు

మమతా బెనర్జీ తన ఎన్నికల అఫిడవిట్‌లో సొంత ఇల్లు, భూమి, వాహనం ఏమీ లేవని వెల్లడించారు. రెండు బ్యాంకు ఖాతాల్లో రూ.12.36 లక్షలు, ఎన్నికల ఖర్చు ఖాతాలో రూ.40 వేలు ఉన్నట్లు తెలిపారు. తన చరాస్థుల విలువ రూ.15.37 లక్షలు కాగా, 9.75 గ్రాముల బంగారం ఉందని పేర్కొన్నారు. రాయల్టీలు, బ్యాంకు వడ్డీలు తన ప్రధాన ఆదాయ వనరులని తెలిపారు.

6.వదినపై హన్సిక రూ.2 కోట్ల దావా

నటి హన్సిక మోత్వాని, వదిన ముస్కాన్‌పై రూ.2 కోట్ల పరువునష్టం దావా ముంబై కోర్టులో దాఖలు చేశారు. తనపై గృహహింస ఆరోపణలు తప్పుడువని, అప్పు చెల్లించకుండా తప్పించుకోవడానికే ఈ ఆరోపణలని పేర్కొన్నారు. ముస్కాన్ ఆరోపణలను ఖండిస్తూ, బహిరంగ క్షమాపణ కోరుతూ సివిల్, క్రిమినల్ కేసులు వేశారు. ప్రశాంత్-ముస్కాన్ 2022 నుంచి విడిగా ఉండగా, కేసు త్వరలో విచారణకు రానుంది.

7.ఆయన వల్లే నేను ఇంత ధైర్యంగా ఉన్నా

నటి సమంత, కెరీర్‌లో ఎదుగుదలకు భర్త రాజ్ నిడమోరు కీలకంగా ఉండారని, ప్రతి సవాలులో ఆయన అండగా ఉన్నారని భావోద్వేగపూర్వకంగా చెప్పారు.

రాజ్ వారిద్దరినీ వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ప్రోత్సహించారని, ప్రతి పనిలో కలిసి ఉండే అనుబంధాన్ని వ్యక్తం చేశారు. భర్త సహకారాన్ని మూలస్తంభంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.

8.మరో వివాదంలో ‘ధురంధర్ 2’

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’పై కాపీరైట్ వివాదాలు తలెత్తాయి. త్రిమూర్తి ఫిల్మ్స్ అనుమతి లేకుండా ‘త్రిదేవ్’ పాట వాడినట్టు కోర్టులో దావా వేసింది.

సినిమా నుండి ఆ పాటను తొలగించాలి, లేక నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. మరోవైపు దర్శకుడు సంతోష్‌కుమార్ కథ కాపీ చేశారంటూ ఆరోపించారు. బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, తదుపరి విచారణ 16న జరగనుంది.

9.పాక్‌పై మాకు నమ్మకం లేదు: ఇజ్రాయెల్‌

అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై ఇజ్రాయెల్ అనుమానం వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌ను విశ్వసించలేమని, అమెరికా తన ప్రయోజనాల కోసం దాన్ని ఉపయోగిస్తోందని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్‌ అజార్‌ తెలిపారు. ఇరాన్ విషయంలో అమెరికాతో సమన్వయం కీలకమని, కాల్పుల విరమణకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అయితే లెబనాన్‌లో హెజ్‌బొల్లా పై సైనిక చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

10.మట తప్పిన ఇజ్రాయెల్..లెబనాన్‌లో రక్తపుటేరులు!

ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు కొనసాగించడంతో 254 మంది మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులకు నిరసనగా ఇరాన్ కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరుకున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *