Today Top 10 News: మంగ్లీ కేసులో కొత్త మలుపు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు రాజకీయ హక్కులు, రిజర్వేషన్లు మొదట కల్పించింది కాంగ్రెస్‌నే అని అన్నారు. డీలిమిటేషన్‌ను 2026 జనాభా లెక్కల ప్రకారం చేసి, మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రతిపాదిస్తున్న 50% సీట్ల పెంపు వల్ల ఉత్తర–దక్షిణ రాష్ట్రాల మధ్య అసమానతలు పెరిగి, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని విమర్శించారు. జీడీపీ మరియు జనాభా ఆధారంగా హైబ్రిడ్ విధానంలో సీట్లు పెంచాలని, దేశానికి ఆదాయం ఇస్తున్న రాష్ట్రాలకు న్యాయం చేయాలని సూచించారు.

2. రేవంత్ ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధం

డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆదాయం ఆధారిత సీట్ల విభజన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజ్యాంగ విరుద్ధమని ఖండించారు. అలా అయితే హైదరాబాద్‌కే అన్ని సీట్లు ఇవ్వాలా? వెనుకబడిన జిల్లాల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాజ్యాంగ పునాదులను బలహీనపరుస్తోందని, అంబేద్కర్ ఆశయాలను అవమానిస్తున్నదని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నిస్తూ, ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచే మోదీ నిర్ణయం సమగ్ర అభివృద్ధికి దోహదమని తెలిపారు.

3.మోయలేని భారంగా అమరావతి

మాజీ మంత్రి పేర్ని నాని, సీఎం చంద్రబాబు అవినీతి కారణంగా అమరావతి రాష్ట్రానికి భారంగా మారిందని విమర్శించారు. రాజధాని స్థల ఎంపికపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ, తక్కువ ఖర్చుతో ‘మావిగన్’ ప్రతిపాదనను పరిగణించాలన్నారు. మంత్రులతో జగన్‌పై అసత్య ప్రచారం చేయిస్తున్నారని, చంద్రబాబుకు విశ్వసనీయత లేదని ఆరోపించారు. అవినీతి, స్వార్థ రాజకీయాలతో రాష్ట్రానికి నష్టం జరుగుతోందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు.

4.చొరబాటుదారులను తరిమికొట్టే సమయం వచ్చింది

కేంద్రమంత్రి అమిత్ షా దేశంలో నక్సలిజాన్ని మోదీ ప్రభుత్వం అణిచివేసిందని, ఇక చొరబాటుదారులను తరిమికొట్టే సమయం వచ్చిందని అన్నారు. బెంగాల్ ఎన్నికల్లో ప్రజలు హింసకు ఓట్లతో సమాధానం ఇస్తారని, మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం వస్తే గూండాలపై కఠిన చర్యలు తీసుకుని చొరబాటుదారులను దేశం నుంచి పంపిస్తామని హెచ్చరించారు. మహిళల భద్రతను బలోపేతం చేసి, ఎప్పుడైనా భయంలేకుండా తిరిగే వాతావరణం సృష్టిస్తామని హామీ ఇచ్చారు.

5.అది రాజ్యాంగంపై దాడి

సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్ల బిల్లుకంటే డీలిమిటేషన్‌ అంశమే ముఖ్యమని, లోక్‌సభ సీట్ల పునర్విభజనను రాజ్యాంగంపై దాడిగా విమర్శించారు. ఎన్నికల సమయంలో ‘నారీ శక్తి వందనం అధినియమ్‌’ సవరణ బిల్లును తీసుకురావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ అంశాలపై చర్చకు సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్షం పలుమార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. మహిళలకు 33% రిజర్వేషన్లకు మద్దతు ఉన్నప్పటికీ, 2027 జనాభా లెక్కలకు ముందు డీలిమిటేషన్‌ చేయడం సరికాదు, అందుకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.

6.మంగ్లీ కేసులో కొత్త మలుపు

గాయని మంగ్లీ (సత్యవతి)–న్యాయవాది సుబ్బారావు మధ్య వివాదం మరో మలుపు తీసుకుంది. ఫిర్యాదు చేసేందుకు మీడియాతో సహా సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు, ఆయన వద్ద ఆల్కహాల్ వాసన రావడంతో, పోలీసులు అనుమానం వచ్చి టెస్ట్ నిర్వహించామని తెలిపారు. డ్రంకెన్ టెస్ట్ చేయగా 27 mg/100ml ఆల్కహాల్ రీడింగ్ నమోదైంది. మైక్రోఫైనాన్స్ పేరుతో రూ.10 కోట్ల మోసం చేశారని సుబ్బారావు ఆరోపించగా, మరోవైపు మంగ్లీ తనను బ్లాక్‌మెయిల్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేశారని సుబ్బారావుపై ఫిర్యాదు చేయగా, ఇరువురి ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

7.నేను ఎవరికీ సలహాలు ఇవ్వను

టీవీకే అధ్యక్షుడు విజయ్‌కు సలహాలిస్తారా అన్న ప్రశ్నకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తాను సాధారణంగా ఎవరికీ సలహాలు ఇవ్వనని, విజయ్‌ సమర్థుడు, పెద్ద స్టార్‌ అని అన్నారు. ఫలితాల ఆశ లేకుండా పని చేయాలని సూచిస్తూ తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ‘జనసేనాని విత్‌ జెన్‌జీ’ కార్యక్రమంలో దేశభక్తి, ప్రకృతి పరిరక్షణపై కంటెంట్‌ చేస్తానని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలంటే త్యాగాలు అవసరం లేదని, సేవ భావనతో రావాలని, సోషల్‌ మీడియాను సరైన విధంగా వినియోగిస్తే అది ఎంతో శక్తివంతమని చెప్పారు.

8.అందుకే సింగిల్‌గా ఉన్నా

టాలీవుడ్‌ నటుడు రామ్‌ పోతినేని తన సింగిల్‌ స్టేటస్‌పై స్పందిస్తూ, ఒంటరిగా ఉండడం తనకు ఇష్టమని చెప్పారు. చిన్నప్పటి నుంచే ఏకాంతానికి అలవాటు పడిన తాను, ఖాళీ సమయాన్ని తనకోసం వినియోగించుకోవడంలో ఆనందం పొందుతానన్నారు. ఎవరైనా జీవితంలోకి వస్తే స్వాగతమే కానీ, ఎవరూ రాకపోయినా ఒంటరిగా సంతోషంగా ఉండగలనని తెలిపారు. సినిమా రంగంలో బిజీగా ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్నానని, లాక్‌డౌన్ సమయంలో ఏడాదిన్నర పాటు ఒంటరిగా ఉన్నానని గుర్తుచేసుకున్నారు.

9. నితీశ్‌ రాణాకు జరిమానా

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఐపీఎల్‌ నియమావళిని ఉల్లంఘించినందుకు దిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటర్‌ నితీశ్‌ రాణాకు మ్యాచ్‌ ఫీజులో 25% జరిమానా, ఒక డిమెరిట్‌ పాయింట్‌ విధించారు. తుది జట్టులో లేని అతను, స్టబ్స్‌కు గ్లవ్స్‌ మార్చుకునే అనుమతి ఇవ్వకపోవడంపై డగౌట్‌ వద్ద అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అదే మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన చెన్నై ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది.

10.మాజోలికొస్తే.. గల్ఫ్‌ రేవులను దిగ్బంధిస్తాం

హర్మూజ్‌ జలసంధిని దిగ్బంధిస్తామన్న అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటనపై ఇరాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించడం సముద్రపు దొంగతనంతో సమానమని ఐఆర్‌జీసీ పేర్కొంది. తమ భద్రతకు ముప్పు ఉంటే పర్షియన్ గల్ఫ్‌ ప్రాంతంలో సముద్ర భద్రతను దెబ్బతీస్తామని, అమెరికా తమ రేవులను దిగ్బంధిస్తే గల్ఫ్‌ రేవులను మూసివేస్తామని హెచ్చరించింది. హర్మూజ్‌ జలాల్లో భద్రతను పర్యవేక్షిస్తూ, తమ అనుమతి ఉన్న నౌకలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తామని స్పష్టం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *