సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. దేవ్‌కి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయింది. సీఎంకు 124 ఆయుధాలను మావోయిస్టులు సరెండర్ చేశారు. ఇలా లొంగిపోయిన మావోయిస్టులలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. వారు సరెండర్ చేసిన ఆయుధాల్లో ఒక INSAS LMG రైఫిల్, (31) AK-47 రైఫిళ్లు, (21) INSAS రైఫిళ్లు, (20) SLR రైఫిళ్లు, (18) 303 రైఫిళ్లు, 33 ఇతర తుపాకులు ఉన్నాయి. వీటన్నింటితో పోలీసులకు మావోయిస్టులు లొంగిపోయారు.
మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చట్టాలు, కార్యక్రమాలు, సోషల్ మీడియాలో మహిళల వేధింపులను కట్టడి చేయాలడానికిగానూ అమలు చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.జేఎన్‌టీయూ ఆడిటోరియంలో జరిగిన స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.మహిళాశక్తి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, సజ్జనార్, సాయి దుర్గతేజ్ పాల్గొన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కర్ణుడిగా పోల్చిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.రేవంత్ రెడ్డి కుంభకర్ణుడని, పేదల గుండెల మీద తన్నే దుర్మార్గుడని ఆయన అన్నారు.కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మారిస్తే, రేవంత్ రైతుబంధును ఎగ్గొట్టాడని విమర్శించారు. ఎన్నికలపై నిద్రలేస్తారని, ప్రభుత్వం పై నిందలు వేయడం మాత్రమే రేవంత్ విధానం అని హరీశ్ రావు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం 2025లో విడుదలైన చిత్రాలకు గద్దర్ ఫిలిం అవార్డ్స్ విజేతలను ప్రకటించింది.విజేతలను జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు, అవార్డుల ప్రదానోత్సవం మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా జరగనుంది.చిరంజీవి ఎన్టీఆర్ జాతీయ అవార్డుతో సత్కరించబడతారు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డులను అందజేయనున్నారు.
తమిళ నటుడు, టీవీకే అధినేత విజయ్ వ్యక్తిగత జీవితంలో విడాకుల వివాదం ముదిరింది.భార్య సంగీత చెన్నై నీలంకరైలోని ఇంట్లో విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు నివసించేందుకు అనుమతి ఇవ్వాలని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై కోర్టు విజయ్‌కు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.
‘ది కేరళ స్టోరీ-2’ చిత్రాన్ని ఎవరూ చూడటం లేదని, రాజకీయ లబ్ధి కోసం కొందరు దాన్ని ఉపయోగిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. సమాజంలో విద్వేషాలు పెంచేందుకు సినిమాలు, మీడియాను ఆయుధాలుగా వాడుతున్నారని ఆయన ఆరోపించారు.ఇలాంటి విషయాలను ప్రశ్నించిన వారిపై దాడులు జరుగుతున్నాయని కూడా అన్నారు.అయితే సురభి తివారీ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, సినిమా చూసి నిజం ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం ది బ్లఫ్ సినిమాతో పాటు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి చిత్రంతో బిజీగా ఉంది. ఈ నెల 16న జరిగే 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఆమె అధికారిక ప్రెజెంటర్‌గా పాల్గొననుంది.హాలీవుడ్ నటులు రాబర్ట్ డౌనీ జూనియర్, విల్ ఆర్నెట్‌లతో కలిసి అవార్డులు ప్రదానం చేయనుంది.ఇప్పటికే 2016లో ఆస్కార్ ప్రెజెంటర్‌గా ఉన్న ప్రియాంక ఎంపికయ్యారు, ఈసారి మళ్లీ అకాడమీ వేదికపై కనిపించనుంది.
పరిశ్రమలో వర్కింగ్ అవర్స్ అంశంపై నటి అనన్య పాండే స్పందించారు.దీపికా పదుకొణె అంకితభావం ఉన్న నటి అని, తల్లి అయిన తర్వాత పని సమయాలపై ఆమె చేసిన డిమాండ్ సరైనదే అని అన్నారు.హీరోయిన్లు వ్యక్తిగత జీవితం,వృత్తి మధ్య సమతుల్యత కోసం నిర్మాతలతో చర్చించడం తప్పు కాదని తెలిపారు.కరీనా కపూర్ తీసుకున్న నిర్ణయాలు కొత్త హీరోయిన్లకు ధైర్యం ఇస్తున్నాయని, పని వేళలపై కఠిన నిబంధనలు ఉండకూడదన్నారు.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు ఆల్ఫాబెట్ రాబోయే మూడేళ్లకు 692 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,361 కోట్లు) భారీ వేతన ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో ఎక్కువ భాగం కంపెనీ పనితీరు ఆధారంగా మారే పెర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్లు, రిస్ట్రిక్టెడ్ స్టాక్స్ ఉన్నాయి.వేమో, వింగ్ ఏవియేషన్ వంటి వెంచర్ల వృద్ధికి కూడా ఆయనకు ప్రత్యేక స్టాక్ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.2015లో సీఈఓ అయిన తర్వాత పిచాయ్ నాయకత్వంలో గూగుల్ మార్కెట్ విలువ 535 బిలియన్ డాలర్ల నుంచి 3.6 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది.
అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం కొనసాగుతున్న సమయంలో గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ క్షమాపణలు తెలిపారు. గల్ఫ్ దేశాలపై ఇకపై దాడులు జరగవని, ఇరాన్‌పై దాడి చేయకపోతే తాము కూడా క్షిపణులు ప్రయోగించబోమని ప్రకటించారు.ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.అయితే అమెరికా ఒత్తిడికి ఇరాన్ లొంగిపోదని, లొంగిపోవాలన్న వారి ఆశలు నెరవేరవని స్పష్టం చేశారు.


