గురువారం కేరళ, అస్సాం పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు అసెంబ్లీలకూ గురువారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేసింది. కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు. .
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే.. టీవీకేకు భారీ షాక్ తగిలింది. ఎడప్పాడిలో ఆ పార్టీ అభ్యర్థి వేసిన నామినేషన్ రద్దు అయ్యింది. ఎన్నికల ముందే ఒక సీటు కోల్పోయింది. ఎడప్పాడిలో టీవీకే అభ్యర్థి నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్ కూడా రద్దు చేసింది. నిబంధనల ప్రకారం కనీసం 10 మంది ప్రతిపాదకుల సంతకం అవసరం. అభ్యర్థి అరుణ్‌కుమార్ నామినేషన్‌లో కేవలం 8 సంతకాలు మాత్రమే ఉన్నాయి. . మరో అభ్యర్థి నిత్యకు 7 సంతకాలు మాత్రమే ఉండటంతో ఈసీ వీరిద్దరి నామినేషన్లను తిరస్కరించింది.
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మీ అవినీతి చిట్టా అంతా ప్రభుత్వం దగ్గర ఉందన్నారు. త్వరలోనే అన్నీ బయటకు వస్తాయని హెచ్చరించారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నేతలు అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారన్నారు. భట్టి, ఉత్తమ్‌పై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. హిల్ట్, టీడీఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తనపై కూడా నాగోల్, వట్టినాగులపల్లి క్రషర్ అంటూ ఆరోపణలు చేశారన్నారు పొంగులేటి. వారికి ఉన్న బురదను మాకు అంటించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానన్నారు మజీ సీఎం వైఎస్ జగన్. ప్రజలతో మమేకం అవుతానన్నారు. .. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేలిపోయాయన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్లిపోయిందన్నారు జగన్. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపే కారిడార్‌తో రాజధానిగా మావిగన్ పేరు సూచించామని తెలిపారు. అమరావతిలో కట్టే బిల్డింగ్‌లు ఇక్కడే కట్టమన్నామన్నారు. అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా సూచించామన్నారు.
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఒక్కసారిగా రన్‌వేపై విమానం నిలిచిపోయింది. విశాఖ నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో ఇబ్బందులు పడ్డారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై .. వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఒక ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడింది.వీటి ప్రభావంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఒకటి, రెండు జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఏపీలో కూడా రానున్న రెండు రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల చోట్ల కురిసే అవకాశముంది.
సీజ్‌ఫైర్ తర్వాత మరోసారి ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఇరాన్‌కు ఆయుధ మద్దతు ఇస్తే 50 శాతం సుంకాలు విధిస్తామన్నారు. ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇరాన్‌కు అంటుకున్న అణు మరకల్ని తొలగిస్తామన్నారు ట్రంప్.
ఇరాన్ సీజ్ ఫైర్ కోసం అడుక్కుందన్నారు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్స్ హెగ్సెత్. ఇరాన్ డిఫెన్స్, ఇండస్ట్రియల్ బేస్‌లను కూల్చేశామన్నారు. ఇరాన్ ఇక మిసైల్స్‌ను తయారు చేసుకోలేదని చెప్పారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశామని.. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగి ఉండదన్నారు. ఇరాన్ సాయంతో అణువ్యర్థాలు వెలికి తీసి తొలగిస్తామన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతం పడిపోయాయి. దీంతో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఏకంగా 2900 పాయింట్లకు పైగా ఎగబాకింది. నిఫ్టీ ఓ దశలో 24 వేల మార్కును తాకింది. చివరికి 24వేల మార్కుకు కాస్త దూరంలో నిలిచింది. దీంతో బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.15 లక్షల కోట్లు పెరిగి రూ.445 లక్షల కోట్లకు చేరింది.
బర్త్‌డే రోజు షాకింగ్ లుక్ పోస్టర్‌తో అందరినీ సర్‌ప్రైజ్ చేశారు అల్లు అర్జున్. ఆయన హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా రానున్న విషయం తెలిసిందే. నేడు ఆయన (Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను టీమ్ విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు ‘రాకా’ (Raaka) అనే పేరు ఖరారు చేసినట్లు తెలిపిన టీమ్.. బన్నీ డిఫరెంట్ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను పంచుకుంది.


