Last Updated:
గరుడ వారధి పైన ఇక పైన ద్విచక్ర వాహనాలు మరియు భారీ వాహనాలు నిషేధం..!
Tirupati Garuda Varadhi: ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తిరుపతి పట్టణ వాసులతో పాటు నిత్యం ఇక్కడకు వచ్చే వేలాది మంది భక్తులకు ఇది ఒక విధంగా అసౌకర్యమే అయినప్పటికి రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తిరుపతి నగరంలో ఉన్న గరుడ వారధి పై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని గరుడ వారధిపై ఇక నుండి ద్విచక్ర వాహనాలతో పాటు భారీ ట్రాన్స్పోర్ట్ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తూ చర్యలు చేపట్టింది.
అనేక పవిత్రక్షేత్రాలు, ప్రముఖ దేవాలయాలకు నెలవైన పట్టణం తిరుపతి. ఇప్పటికే టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతిని స్మార్ట్ సిటీగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈనేపథ్యంలోనే పట్టణవాసులతో పాటు ఇక్కడికి వచ్చే ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇకపై గరుడ వారధి పై ద్విచక్ర వాహనాలు, భారీ ట్రాన్స్ పోర్ట్ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగూణంగానే చర్యలు చేపట్టింది. తిరుపతి స్మార్ట్ సిటీ అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, ఐఏఎస్., జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి మౌర్య, ఐఏఎస్, సంబంధిత విభాగాల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర అభివృద్ధి, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల భద్రత వంటి పలు అంశాలతో పాటు గరుడ వారధి పై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా చర్చించారు. గరుడ వారధి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల వివరాలను అధికారులు సమగ్రంగా పరిశీలించారు. అందులో ఎక్కువ శాతం ప్రమాదాలు ద్విచక్ర వాహనాలు , భారీ ట్రాన్స్పోర్ట్ వాహనాల వల్లనే జరుగుతున్నట్లు గుర్తించారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలను తగ్గించేందుకు , ప్రజల ప్రాణ భద్రతను కాపాడేందుకు గరుడ వారధి పై ద్విచక్ర వాహనాలు , భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. ప్రజల భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి నిబంధనలను తప్పకుండా పాటించాలని అధికారులు కోరారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాలను నివారించి భద్రతను మరింత బలోపేతం చేయాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirupati,Chittoor,Andhra Pradesh
Mar 11, 2026 11:32 AM IST



