Last Updated:
నారా చంద్రబాబునాయుడు కుటుంబంతో తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం, నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు, టీటీడీ నుంచి తీర్థప్రసాదాలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌లతో కలిసి ఈ పర్యటన చేపట్టారు.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి కుటుంబానికి మహద్వారం వద్ద అర్చకులు ‘ఇస్తికఫాల్’ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం సీఎం బృందం స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ ప్రదక్షిణలో భాగంగా శ్రీ వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం హుండీలో కానుకలు సమర్పించిన ముఖ్యమంత్రి, స్వామివారికి శేష వస్త్రాన్ని అందజేశారు.
వేదాశీర్వచనం ప్రసాద వితరణ రంగనాయకుల మండపంలో వేద పండితులు ముఖ్యమంత్రి కుటుంబానికి వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కలిసి సీఎంకు కు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, పరాభవ నామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, జేఈవోలు వీరబ్రహ్మం, శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం సహా పలువురు రాష్ట్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Mar 21, 2026 11:25 AM IST


