Last Updated:
Tirumala:తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం లో శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
Tirumala: తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం లో శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. స్వామి వారి సేవలో భక్తిశ్రద్ధలతో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు.
అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన, రాబోయే మార్చి 5వ తేదీన తన కుమారుడి వివాహం జరుగనున్న సందర్భంగా పెళ్లి పత్రికను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేకంగా ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. ఈ దర్శనం తనకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందని, కుటుంబానికి శుభమంగళాలు కలగాలని ప్రార్థించినట్లు వెల్లడించారు.అదే విధంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి కూడా శుక్రవారం ఉదయం విఐపీ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి సేవలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఆయన, మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, దేవస్థాన అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన భక్తిశ్రద్ధలతో స్వామివారికి నమస్కరించి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించినట్లు తెలిపారు. ప్రముఖులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం వల్ల ఆలయంలో భక్తి వాతావరణం మరింత ఉత్సా
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirumala,Chittoor,Andhra Pradesh
Feb 13, 2026 12:37 PM IST


