Last Updated:
Tirumala: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుమలలో శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి కాలి నడక మార్గాన వెళ్లిన కవిత స్వామివారి అభిషేక సేవలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Tirumala: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుమలలో శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి కాలి నడక మార్గాన వెళ్లిన కవిత స్వామివారి అభిషేక సేవలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకుని దర్శనం ముగించుకున్నారు.
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన కవిత గత నాలుగు సంవత్సరాలుగా తాను తీవ్ర మనోవేదనను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. అయితే స్వామివారి కృపతో కోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని తెలిపారు. కోర్టు కేసులు కొట్టివేయబడిన నేపథ్యంలో మొక్కు తీర్చుకోవడానికి అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నానని చెప్పారు.
అలాగే రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రజలకు దగ్గరగా పనిచేసే ఒక రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. ఆ పార్టీకి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirumala,Chittoor,Andhra Pradesh
Mar 06, 2026 10:47 AM IST


