Tirumala: వివాహ తొలి శుభలేఖ తిరుమలకు పంపండి.. గిఫ్ట్ పొందండి
ఇంట్లో పెళ్లి ఫిక్స్ అయితే.. ఇప్పుడు తొలి శుభలేఖను తిరుమల శ్రీవారి చెంతకు పంపుకోవచ్చు. పెళ్లికి నెల ముందు ఇలా చెయ్యవచ్చు. అలా శుభలేఖ పంపాక, తిరుమల నుంచి ప్రత్యేక కానుక వస్తుంది. అందులో వధూవరుల కోసం చేతికి కట్టడానికి కంకణాలు, తలంబ్రాలలో కలిపే అక్షతలు, వివాహ గొప్పదనం చెప్పే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి వస్తుంది. అందుకోసం టీటీడీ ఒక అడ్రెస్ ఇచ్చింది. శుభలేఖపై.. రిటర్న్ అడ్రెస్ రాసి ఉండాలి. అప్పుడే బహుమతి వస్తుంది.
అడ్రెస్ వివరాలు:
To,
Sri Lord Venkateswara Swamy,
The Executive Officer,
TTD Administrative Building, K.T.Road, Tirupati 517501.


