Last Updated: Apr 12, 2026, 14:25 IST
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా వేసవి కాలం ప్రారంభమవ్వడంతో తాగునీటి అవసరం మరింత పెరుగుతుండటంతో, భక్తులు ఎండలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, అక్కడ మొబైల్ వాటర్ డ్రమ్స్ ఏర్పాటు చేసి, శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు నేరుగా తాగునీటిని అందిస్తున్నారు. భక్తులు నీటి కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా, వారు ఉన్న ప్రదేశానికే సేవకులు వెళ్లి నీటిని అందించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.


