Last Updated:
Tiger Video: పెద్దపులి హ్యాపీగా ఆడుకోవడం ఎప్పుడైనా చూసారా? ఎవరూ లేనప్పుడు పెద్దపులి ఇలా ప్రవర్తిస్తుందా..? రాజసం, గంభీరత్వాన్ని ప్రదర్శించే పెద్దపులి రియల్ నేచర్ ఎలా ఉందో చూడండి.
Tiger Video: పెద్దపులి ఆనందంగా ఆడుకోవడం ఎప్పుడైనా చూసారా? ఎవరూ లేనప్పుడు పెద్దపులి ఈవిధంగా ఉంటుందా, రాజసం, పెద్దపులి నడక, గంభీరతత్వం, పెద్దపులిని రియల్ గా చూసే అవకాశం ఎవరికీ ఉండదు, కానీ ఏ యూట్యూబ్ లో చూసినా లేక ఏజూలో చూసినా దాని రాజసమే వేరని చెప్పుకోవచ్చు. కానీ పెద్దపులికి మనసు ఉంటుందని..దానికి సరదా సరదాగా గడపాలని ఉంటుందని ఒక పెద్దపులి నిరూపించింది. దాదాపు 20 రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజల్ని, అధికారుల్ని ముప్పతిప్పలు పెడుతున్న పెద్దపులి ఒక డ్రోన్ కెమెరా లో చిక్కింది. ఆ డ్రోన్ కెమెరాలో పెద్దపులి ఆడుకుంటూ పైకి తనకాళ్లు పెడుతూ, అటూ ఇటూ చూస్తూ సరదా సరదాగా గడపడం రికార్డు అయింది. దీంతో నడక నడిచేటప్పుడు మాత్రమే రాజసం మిగిలిన సమయంలో పెద్ద పులి సైతం కూల్‌గా ఉంటుందని అర్థమవుతుంది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి తాజాగా రంపచోడవరం నియోజకవర్గం అటవీ ప్రాంతంలో ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారణ చేశారు. అయితే ఓపక్క కాకినాడ జిల్లాలోకి ప్రవేశిస్తూ మరోపక్క రంపచోడవరంలోకి అడుగుపెడుతూ, గేదెలను, ఆవులను చంపుతున్న పెద్దపులి ఈసారి పూర్తిగా ఏవిధంగా ఉంటుందో డ్రోన్ కెమెరాకు చిక్కింది. పరిస్థితి చేయి దాటడం వరసగా దాడులు చేయడంతో పెద్దపులి ఎలాగైనా బంధించాలి మళ్లీ గన్ ఇంజక్షన్లతో పెద్దపులిని పట్టుకోవాలని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. ఈ సమయంలోనే ఓపెన్ ఫారెస్ట్ లో డ్రోన్ కెమెరా ఎగరవేసి పెద్దపులి ఎక్కడైనా ఉందేమో అన్న విధంగా గాలింపు చర్యలు చేపట్టారు సరిగ్గా అదే సమయంలో పెద్దపులి ఈ డ్రోన్ కెమెరాకు చిక్కింది.
రంపచోడవరం అటవీ ప్రాంతంలో తాటిచెట్లు పచ్చని నేల గడ్డి ఉన్న ప్రాంతంలో పెద్దపులి ఆడుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. పెద్దపులికున్న నాలుగు కాళ్లు పైకిపెట్టి పైకి కిందకి ఆడించడం తల అటు తిప్పడం, ఒక పక్కకి ఒరిగి చూడటం, మొత్తానికి ఏ మాత్రం రాజసం అనేది పక్కనపెట్టి ఎంతో ఉత్సాహంగా పెద్దపులి ఉన్నట్లుగా ఈ వీడియోలో స్పష్టం అవుతుంది. నిజానికి పెద్దపులి ఎంతో ఆరోగ్యంగా ఉందని తెలియజేయడానికి అటవీశాఖ అధికారులు ఈ వీడియో బయటకి రిలీజ్ చేసినప్పటికీ, పెద్దపులిలో మరో కోణం సైతం కనిపించింది. నడుస్తుంటే భయం చూస్తే ఆందోళనగా ఉండే పెద్దపులి కేవలం ఒక పిల్లి పిల్ల మాదిరిగా సరదా సరదాగా గడపడం ఈ వీడియోలో మాత్రమే తొలిసారి కనిపించిందని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం రాజవొమ్మంగి రంపచోడవరం ప్రాంతంలో పెద్దపులి ఉన్న నేపథ్యంలో అడవి గుండా వెళ్లే గిరిజనులు జాగ్రత్త వహించాలని అటవిశాఖ అధికారులు చెబుతున్నారు. ఆవులు, దూడలు, గేదెలు వంటివి అటవీ ఆవాసాల్లో ఉంచకుండా జాగ్రత్తలు పడాలని పేర్కొన్నారు, పులి మోనిటరింగ్ జరుగుతుందని త్వరలోనే బంధించడం జరుగుతుందంటూ అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మరపక్క రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి సైతం వీడియో రిలీజ్ చేశారు.ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి పులివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తున్నట్లుగా స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kakinada,East Godavari,Andhra Pradesh
Mar 10, 2026 12:27 PM IST


