Last Updated:
Tiger Rescue: తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి తెలివిగా వ్యవహరిస్తూ తన కదలికలను అధికారులు పసిగట్టకుండా ప్రయత్నిస్తోంది. పులిని పట్టుకునేందుకు ప్రభుత్వం హనుమాన్ టీమ్‌లను రంగంలోకి దింపడంతో ఏకంగా జిల్లా నుంచి మకాం మార్చేసింది.
Tiger Rescue: తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి తెలివిగా వ్యవహరిస్తూ తన కదలికలను అధికారులు పసిగట్టకుండా ప్రయత్నిస్తోంది. పులిని పట్టుకునేందుకు ప్రభుత్వం హనుమాన్ టీమ్‌లను రంగంలోకి దింపడంతో ఏకంగా జిల్లా నుంచి మకాం మార్చేసింది. అంతేకాదు ఎక్కడ ఏ గేదె, ఆవులపై దాడి చేయకుండా రెండు రోజులుగా అటవీ మార్గంలో ప్రయాణం చేస్తుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా అడవిలో పులి ఉంటే మనల్ని ఏం చేస్తుందిలే అనే ఫీలింగ్ అధికారులకు కలిగించాలని టైగర్ ప్రవర్తిస్తోంది. నిన్న మొన్నటి వరకు ముప్పతిప్పలు పెట్టిన పులి డిప్యూటీ సీఎం ఆదేశాలతో వచ్చిన 105 మంది హనుమాన్ టీమ్ రాకతో జిల్లాలో మఖాం మార్చి ఒక్కసారిగా అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో పెద్దపులి అడవిలోనే ప్రయాణిస్తుందా లేక మళ్లీ జనంలోకి వస్తుందా అనేది సస్పెన్స్‌గా ఉంది.
గోదావరి వాసులను ఇబ్బందులు పెడుతున్న పెద్దపులి నిన్న మొన్నటి వరకు కాకినాడ జిల్లాను వణికించింది. ఒక్క కాకినాడ జిల్లాలో దాదాపు 15 రోజులకు పైగా మకాం వేసి, చిక్కదు దొరకదు అనే మాదిరిగా అధికారులను ప్రజలను ఇబ్బందులు పెట్టింది. వరుసగా ఆవులను గేదెలను హతమార్చింది. ప్రజలు తిరిగే ప్రాంతాల్లో సైతం సంచరించడంతో ఈ విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. అడవులకు అడవి జంతువులకు ఇబ్బంది లేకుండా చూసే హనుమాన్ టీములను పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాకు పంపించారు.
దాదాపు 150 మంది పులిని బంధించే ప్రక్రియను ప్రారంభించారు. అంతే ఒకసారిగా పులి కాకినాడ జిల్లా నుంచి మరల డీప్ ఫారెస్ట్ ఉన్న రంపచోడవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఒకవేళ అక్కడైనా దాడులు చేస్తుందా అంటే ప్రశాంతంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అడ్డతీగల మండలం వీరభద్రపురం రిజర్వా ఫారెస్ట్ లో పెద్దపులి ఉందని సబ్ డి ఎఫ్ ఓ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే పులి ప్రయాణం కొనసాగిస్తున్న నేపథ్యంలో బోరనాగుడెం చెరుకుంపాలెం ప్రధాన రోడ్ల సైతం దాటి మరల అడవి ప్రాంతం గుండా వెళుతుందని తెలిపారు. అయితే సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేసినప్పటికీ ఎక్కడ దాడి చేయకపోవడంతో పులి ప్రశాంతంగా దట్టమైన అడవిలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
పెద్దపులి ఈ విషయంలో అధికారులు అడవిలోకి వెళ్లిందని చెబుతున్నప్పటికి మళ్లీ వెనక్కి వస్తుందా లేక దట్టమైన అడవిలోకి ఉంటుందా అనే సందేహాలు జిల్లా ప్రజల్లో కలుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా పులిని బంధించేందుకు వచ్చిన హనుమాన్ టీములు మరికొన్ని రోజులు ఉంటాయా లేక వెనక్కి వెళ్ళిపోతాయా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kakinada,East Godavari,Andhra Pradesh


