Tiger Alert: ఫారెస్ట్ అధికారులు ఎదురుగా పెద్దపులి..? భయంతో వెనక్కి పరుగులు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

Tiger Alert: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ఉన్న పెద్దపులి విషయంలో ప్రజలకన్నా అటవీశాఖ అధికారులే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతినిత్యం సిగ్నల్ ద్వారా ఎక్కడుందో పెద్దపులిని తెలుసుకునేందుకు ప్రత్యేక టీం పనిచేస్తుంది.

+

ఫారెస్ట్

ఫారెస్ట్ అధికారులు ఎదురుగా పెద్దపులి?భయంతో వెనక్కి పరుగులు

Tiger Alert: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ఉన్న పెద్దపులి విషయంలో ప్రజలకన్నా అటవీశాఖ అధికారులే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతినిత్యం సిగ్నల్ ద్వారా ఎక్కడుందో పెద్దపులిని తెలుసుకునేందుకు ప్రత్యేక టీం పనిచేస్తుంది. ముఖ్యంగా కింద స్థాయి ఫారెస్ట్ అధికారులైతే దాదాపురోజులుగా ఈ పెద్దపులి వెనకే తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పెద్దపులి ఎక్కడ ఉంది అని సిగ్నల్ అన్వేషిస్తూండగా గండిపోచమ్మ ఆలయ సమీప రహదారిలో వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా సిగ్నల్ రెడ్ అలర్ట్ చూపించింది. అంతే అది కదులుతూ ముందుకు వస్తున్న విధానం పారస్ అధికారులు గుర్తించారు. బహుశా పులి వారుఉన్న ఒక వందఅడుగుల ముందే వస్తున్న అంచనా వేశారు, అసలే అటవీప్రాంతం రహదారిపై ఎవరూ లేరు భయంతో ఒక్కసారిగా కింద స్థాయి ఫారెస్ట్ అధికారులు ముఖ్యంగా మహిళ ఫారెస్ట్ ఉద్యోగుల సైతం వెనక్కి పరుగులు తీస్తూ వారివాహనాలపై వెనక్కి వచ్చేసిన పరిస్థితి నెలకొంది. దాదాపు ఒకటికాదు, రెండుకాదు, 45 రోజులుగా ఈ పెద్ద పులి విషయంలో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఫారెస్ట్ అధికారులు కూడా అంతే ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం ప్రతి ఒక్కరు గ్రహించాల్సిందే.

గుడి దగ్గర పులి ..

పెద్దపులి దేవిపట్నం గండిపోచమ్మ ఆలయ సమీప ప్రాంతంలోనే ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ప్రస్తుతం సిగ్నల్ సైతం క్యాచ్ కాని పరిస్థితి నెలకొంది. దీంతో ఏ ప్రాంతంలో ఉంది అని మండుటెండలను సైతం లెక్కచేయకుండా చెవులకు కాచీఫ్ కట్టుకుని రహదారులు గుండా ఈ సిగ్నల్ పట్టుకుని అటవీ శాఖ అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలకు పూర్తిగా గండి పోచమ్మ ఆలయ సమీపంలోనే ఉందన్న ప్రచారం తెలియడంతో పర్యాటకానికి ఆ దేవాలయానికి సైతం ప్రజలు భక్తులు బ్రేక్ చెప్పారు. నిత్యం కళకళలాడే పర్యాటక ప్రాంతం అమ్మవారి ఆలయం పూర్తిగా వెలవెలబోతూ కనిపిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 45 రోజులుగా ఈ పెద్దపులి ప్రయాణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.

ఆచితూచి..

పెద్దపులి విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి? జాతీయ జంతువు అయిన పెద్దపులిని పట్టుకోవాలంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, పైనుంచి వారికి ప్రత్యేకమైన ఆర్డర్స్ రావాలి, ఇష్టారాజ్యంగా ముందుకు వెళ్లడానికి ఉండదు, కానీ ఇవేమీ తెలియని కొందరు ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడం లేదు అంటూ మాట్లాడటం కూడా వారిని బాధిస్తున్నట్లుగా కొంతమంది పారస్టు అధికారుల ద్వారా తెలుస్తుంది. ఏది ఏమైనా ఆనందం పడాల్సిన విషయం ఇక్కడ ఒకఆవులు గేదెలు దూడలు తప్ప ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ పెద్దపులిని పట్టుకుని తీరతామంటూ చెబుతున్న ఫారెస్ట్ అధికారులకు మనమంతా సలాం కొట్టాల్సిందే.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *