తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జనగణనలో వివరాలు ఇవ్వని వారికి రూ.1000 ఫైన్ విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర డైరెక్టర్ భారతీ హోలికేరి తెలిపారు. హైదరాబాద్ సెన్సస్ ఆఫీసులో శనివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశాభివృద్ధి ప్లాన్స్ వెయ్యడానికీ జనగణన ప్రక్రియ కీలకం అన్నారు. నియోజకవర్గాల్ని పునర్విభజించాలన్నా, రిజర్వేషన్లను ఖరారు చెయ్యాలన్నా ఈ ప్రక్రియ ముఖ్యం అన్నారు. 16 ఏళ్ల తర్వాత జరుగుతున్న జనాభా లెక్కలు కాబట్టి.. ప్రజలంతా సమాచారం ఇవ్వడం అవసరం అన్న ఆమె.. ఎవరైనా సమాచారం ఇవ్వకుండా ఉంటే వారికి రూ.1000 వరకు జరిమానా విధించే రూల్ ఉందని గుర్తుచేశారు. మే 11 నుంచి జూన్ 9 వరకు తొలి విడత, 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు రెండో విడత జనగణన జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.
ఇవాళ ఏమున్నాయి?
ఇరాన్ యుద్ధానికి 15 రోజులు పూర్తి అయ్యింది. ఇవాళ 16వ రోజు కొనసాగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్.. యూసఫ్‌గూడ లోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతుంది. పాతాళ భైరవి సినిమాకి నేటితో 75 ఏళ్లు పూర్తి అయ్యాయి. నేడు రాత్రికి ఆకాశంలో గామా నామిడ్స్ ఉల్కాపాతం కనిపిస్తుంది. ఇవాళ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.


