ఇవాళ ఏమున్నాయి?:
నేడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఉంది. నేడు నెల్లూరు మేయర్ ఎన్నిక ఉంది. మాజీ సీఎం జగన్ హాజరవుతున్నారు. నేడు భారత్‌కు కెనడా ప్రధాని మార్క్ కార్నీ వస్తున్నారు. ప్రధాని మోదీ, వ్యాపారవేత్తలతో భేటీ అవుతారు. నేటి నుంచి తెలంగాణలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. నేటి నుంచి మార్చి 2 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగుతాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ హై స్కూల్ NTR KVK స్టేడియంలో ఉపాధి మేళా ఉంది. గుంటూరు జిల్లా తుళ్లూరులో ఉన్న CRDA కార్యాలయంలోని స్కిల్ హబ్ దగ్గర జాబ్ మేళా ఉంది. అనంతపురం జిల్లా.. రాయదుర్గం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా ఉంది. టీ20 ప్రపంచకప్ లో నేడు ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ రాత్రి 7 గంటలకి ఉంది. రెండు జట్లకూ ఇది తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.


