భారత వాతావరణ శాఖ తాజా రిపోర్టు ప్రకారం కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. అలాగే తెలంగాణలో ఏప్రిల్ 8, 9 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. వర్షంతోపాటూ.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణ, రాయలసీమపై 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి ఉంది.



