Summer Special Train: దివ్య దర్శన్ పేరుతో రైల్వే బంపర్ ఆఫర్.. సమ్మర్‌లో అద్భుతమైన ప్రదేశాలు చూసే ఛాన్స్ | బిజినెస్


Last Updated:

Summer Special Train:ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి దివ్యదక్షిణ యాత్ర పేరుతో రైల్వే ఐఆర్సిటిసి అధికారులు సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ ట్రైన్ ప్యాకేజెస్ వివరాలు వెల్లడించారు.

+

Summer

Summer Special Train

Summer Special Train: ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి దివ్యదక్షిణ యాత్ర పేరుతో రైల్వే ఐఆర్సిటిసి అధికారులు సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ ట్రైన్ ప్యాకేజెస్ వివరాలు వెల్లడించారు. రైలు ప్రయాణంతో పాటు వెహికల్ ట్రావెలింగ్, అకామిడేషన్ , ఫుడ్ పూర్తిగా ఐఆర్సిటిసి చూసుకుంటుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి నాలుగు ప్యాకేజీ టూర్లను సమ్మర్ నేపథ్యంలో రిలీజ్ చేస్తున్నట్లుగా ఐఆర్సిటిసి అధికారులు కాకినాడ జిల్లాకు సంబంధించి మీడియా సమావేశంలో వెల్లడించారు.

భారత్ గౌరవ్ యాత్ర..

విశాఖపట్నం నుంచి పూరి, కోణార్క్, బద్రీనాథ్, వారణాసి, అయోధ్య, ప్రయోగరాజ్ వంటి టెంపుల్స్ దర్శనంతో పాటు అదే విధంగా ట్రైన్ , బస్సు వెహికల్ ట్రావెలింగ్ తో కలిపి ఒక్కొక్కరికి 16, 700 ప్యాకేజ్ తో ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమై మార్చి ఏడవ తేదీతో ఈ ప్రయాణం ముగుస్తుందన్నారు. మళ్లీ జూన్ మూడవ తేదీన ప్రారంభమై జూన్ 12వ తేదీతో ముగుస్తుందని పేర్కొన్నారు.

శైవదర్శనాలు..

అలాగే దివ్య దక్షణ్ యాత్ర విత్ అరుణాచలం పేరుతో అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి తిరుచ్చి తంజావూర్, చిదంబరం ప్యాకేజీ 14, 500 ఒక్కొక్కరికి తెలియజేశారు. మే 24వ తేదీన ఈ రైలు ప్రారంభమై మే 31వ తేదీకి ఈ టూర్ ముగుస్తుందని తెలిపారు.

వైష్ణోమాత దర్శనం..

అలాగే మాతవైష్ణవి దేవి విత్ హరిద్వార్ ఋషికేష్ యాత్ర పేరుతో హరిద్వార్ ఋషికేష్ మాతృ బృందావన్ మాత వైష్ణవి దేవి టెంపుల్స్ ప్యాకేజీ 16, 500గా తెలియజేశారు. అలాగే తమిళనాడు టెంపుల్స్ హిల్స్ విజయవాడ పేరుతో తంజావూర్ రామేశ్వరం మధురై కొడైకెనాల్ ఒక్కొక్కరికి 36, 300గా పేర్కొన్నారు.

టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి..

ఈ టూర్స్ కు సంబంధించి ఏసీ టెంపో ట్రావెలర్ వంటి వాటిల్లో ప్రయాణాలు జరుగుతాయి అని తెలిపారు. రైలుతో పాటు ఆ సమీప ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు ప్రత్యేక బస్సులు లేదా ఏసీ టెంపుల్ లో ప్రయాణికులను తీసుకువెళ్లడం జరుగుతుందని ప్రకటించారు. పూర్తి ఎకామిడేషన్ తో పాటు ఈ రుసుముగా తెలియజేశారు. వీటికి సంబంధించి రైల్వే అధికారులు నెంబర్స్ 92814 95848.   92810 30714. 76709 00698 వంటి నెంబర్లతో పాటు www.. Irctctourism.com ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.

సమ్మర్ లో ఆధ్యాత్మిక యాత్ర..

సమ్మర్ నేపథ్యంలో రైల్వే కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకొని ఆనందంగా గడపాలన్నారు. ప్రతి భోగికి ఒక ఐఆర్సిటిసి ప్రతినిధి తో పాటు ఒక మేనేజర్ ఉంటారని వారే ఈ ప్రయాణం రైల్లో పర్యవేక్షిస్తారు అంటూ ఐ ఆర్ సి టి సి అధికారులు మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా ఫుడ్ కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైల్లోనే వంటకాలు తయారుచేసి ప్రయాణికులకు అందించడం జరుగుతుందని తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *