Summer Heat: వేసవిలో మీ ఇల్లు చల్లగా ఉండాలా? అయితే ఈ ‘పెయింట్ మ్యాజిక్’ ట్రై చేయండి! |


Last Updated:

వేసవిలో డాబా ఇళ్లలో వేడి తగ్గించడానికి డ్యాంప్ ప్రూఫ్ ఫ్లోరింగ్ పెయింట్ ఉపయోగించాలి. సుందరాడ పెయింటర్ మాధవ సూచన ప్రకారం, ఇది సూర్యకిరణాల వేడిని తగ్గించి ఇంట్లో చల్లదనాన్ని పెంచుతుంది.

+

డాబా

డాబా ఇళ్లలో వేడి తగ్గించే సులభ మార్గం ఇదే 

వేసవికాలంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్లలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా డాబా ఇళ్లలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వేడి ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే డాబా పైభాగానికి డ్యాంప్ ప్రూఫ్ ఫ్లోరింగ్ పెయింట్ వేయడం ద్వారా ఇంట్లో చల్లదనాన్ని పెంచుకోవచ్చని సుందరాడ చెందిన పెయింటర్ మాధవ తెలియజేశారు.

డాబా పైకప్పు నేరుగా సూర్యకిరణాలకు గురవుతుంది. దీని వల్ల కాంక్రీట్ వేడిని ఎక్కువగా గ్రహించి ఇంటి లోపలికి పంపిస్తుంది. దీంతో గదులు వేడిగా మారి ఫ్యాన్ లేదా కూలర్ ఉన్నా చల్లదనం అనిపించదు. ఈ సమస్యను తగ్గించడానికి డాబాపై డ్యాంప్ ప్రూఫ్ ఫ్లోరింగ్ పెయింట్ వేయడం మంచి పరిష్కారం అన్నారు.

డ్యాంప్ ప్రూఫ్ పెయింట్ ప్రధానంగా నీరు చొరబడకుండా ఉండేందుకు ఉపయోగించే ప్రత్యేక రకం పెయింట్. అయితే దీనికి మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఇది సూర్యకిరణాల నుంచి వచ్చే వేడిని కొంతవరకు ప్రతిబింబింపజేస్తుంది. దీంతో పైకప్పు వేడి తక్కువగా గ్రహించి ఇంటి లోపలి ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. ఫలితంగా ఇంట్లో సహజంగా చల్లదనం ఏర్పడుతుంది.

ప్రత్యేకంగా తెలుపు లేదా లేత రంగుల డ్యాంప్ ప్రూఫ్ పెయింట్ ఉపయోగిస్తే ఇంకా మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ రంగులు సూర్యకాంతిని ఎక్కువగా ప్రతిబింబింపజేసి పైకప్పు వేడిని తగ్గిస్తాయి. దీంతో ఇంట్లో 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

డాబాపై ఈ పెయింట్ వేయడం వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే వర్షాకాలంలో నీరు చొరబడే సమస్య తగ్గుతుంది. చాలా ఇళ్లలో వర్షం పడినప్పుడు పైకప్పు నుంచి నీరు చొరబడటం లేదా గోడల్లో తడిసిన మచ్చలు రావడం జరుగుతుంది. డ్యాంప్ ప్రూఫ్ పెయింట్ ఈ సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.

ఇంకా ఈ పెయింట్ వేసే ముందు డాబాను పూర్తిగా శుభ్రం చేసి పగుళ్లు ఉంటే వాటిని సిమెంట్‌తో పూడ్చడం అవసరం. అనంతరం రెండు లేదా మూడు కోటింగ్‌లు వేయడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. ఒకసారి సరైన విధంగా పెయింట్ వేస్తే 5 సంవత్సరాల పాటు దీని ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది వేసవిలో ఎయిర్ కండీషనర్లు, కూలర్లు ఉపయోగించి విద్యుత్ ఖర్చు పెంచుకుంటున్నారు. అయితే డ్యాంప్ ప్రూఫ్ ఫ్లోరింగ్ పెయింట్ వేయడం ద్వారా సహజంగా ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు.

దీనివల్ల విద్యుత్ వినియోగం కొంత మేర తగ్గే అవకాశం ఉంది. అందుకే వేసవి తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో డాబా ఇళ్లలో నివసించే వారు డ్యాంప్ ప్రూఫ్ ఫ్లోరింగ్ పెయింట్ వేయించుకోవడం ద్వారా ఇంట్లో చల్లదనాన్ని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇచ్చే సరళమైన పరిష్కారంగా మారుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *