Summer Diseases: ఎండ తీవ్రతతో పశువుల్లో ‘హీట్ స్ట్రెస్’.. వేసవిలో పాడి రైతులు చేయాల్సిన పనులివే! |


Last Updated:

వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రతలతో పశువుల్లో హీట్ స్ట్రెస్, డీహైడ్రేషన్, చర్మ వ్యాధులు పెరుగుతున్నాయని డాక్టర్ మోహన్ హెచ్చరిక, నీడ, శుభ్రజలం, టీకాలు తప్పనిసరి అన్నారు

+

వేసవికాలంలో

వేసవికాలంలో పశువులకు వచ్చిన వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే

వేసవికాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో పశువుల్లో అనేక రకాల వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయని విజయనగరం వెటర్నరీ పోలి క్లినిక్‌కు చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మోహన్ తెలిపారు. తీవ్ర ఎండలు, తగినంత నీటి కొరత, పచ్చికల లేమి వంటి పరిస్థితులు పశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆయన వెల్లడించారు.

ఈ కాలంలో ముఖ్యంగా హీట్ స్ట్రెస్ (వేడిమి ఒత్తిడి), డీహైడ్రేషన్ (ద్రవాల లోపం), చర్మ సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువులు తక్కువగా ఆహారం తీసుకోవడం, పాల ఉత్పత్తి తగ్గిపోవడం వంటి సమస్యలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నీరు తక్కువగా తాగడం వల్ల శరీరంలో ద్రవాల లోపం ఏర్పడి అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.

ఈగలు, దోమలు వంటి కీటకాల పెరుగుదల వల్ల చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. పశువుల నివాస ప్రాంతాలు శుభ్రంగా లేకపోతే ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు. గడ్డి కొరత కారణంగా పశువులు మట్టిని తినే పరిస్థితి ఏర్పడి, దాంతో హానికర బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లి “చిటిక వ్యాధి” వంటి సమస్యలు వచ్చే అవకాశముందని వెల్లడి చేశారు.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పశువులకు ఎల్లప్పుడూ శుభ్రమైన, చల్లటి నీరు అందుబాటులో ఉంచాలని, వీలైనంత వరకు నీడ ఉన్న ప్రదేశాల్లో ఉంచాలని తెలిపారు. గాలిప్రవాహం సరిగా ఉండే విధంగా షెడ్లు ఏర్పాటు చేయడం ఎంతో అవసరమన్నారు. అలాగే సమతుల ఆహారం ఇవ్వడంతో పాటు ఖనిజ లవణాలు కలిగిన మిశ్రమాలను ఆహారంలో కలపాలని సూచించారు.

ప్రభుత్వం ద్వారా ప్రతి వెటర్నరీ క్లినిక్‌లో పశువులకు ఉచిత టీకాలు అందిస్తున్నట్లు తెలిపారు. క్రమం తప్పకుండా టీకాలు వేయించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని చెప్పారు. అలాగే నీటి మట్టం తక్కువగా ఉన్న చెరువులు, కలుషిత జల వనరుల వద్దకు పశువులను తీసుకెళ్లకూడదని సూచించారు. అలాంటి నీరు తాగడం వల్ల తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

పశువుల ఆరోగ్యంలో ఏవైనా మార్పులు గమనించిన వెంటనే సమీప పశువైద్యుడిని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వేసవికాలంలో పశువులను వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవచ్చని డాక్టర్ మోహన్ స్పష్టం చేశారు. రైతులు అప్రమత్తంగా ఉంటే పశుసంవర్ధక రంగంలో నష్టాలను తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *