Last Updated:
Success Story: టీ అలవాటు నూటిలో 99శాతం మందికి ఉంటుంది. అయితే అన్నీ చోట్ల టేస్టీ టీ దొరకదు. కాని తాగక తప్పదు. ఆ విధంగా టీ అలవాటు అయిపోయింది. కాని అక్కడ దొరికే చాయ్ మాత్రం మరెక్కడ దొరకదంటున్నారు దాని రుచి చూసిన వాళ్లు.
Success Story: తండ్రి నుండీ వారసత్వం అందుకొని 50 సంవత్సరాల అనుభవం కలిగిన టీ మాస్టర్ తోట పాలెం వెంకటేష్. వీరి కుటుంబం దశాబ్దాల పాటు ప్రజలకు టీ అందిస్తూ, సమాజంలో ప్రజలతో మమేకమై ఉన్నారు. టీ సంస్కృతిలో వచ్చిన మార్పులను కళ్ళారా చూసిన తోటపాలెం వెంకటేష్ రుచిలో స్థిరత్వం ఏర్పరచుకొని 50 ఏళ్లుగా అదే రుచి, అదే చిక్కదనం, అదే నాణ్యతను మెయింటెన్ చేస్తూ స్థానిక ప్రజలకు అద్భుతమైన టి అందిస్తున్న తోటపాలెం వెంకటేష్ ను లోకల్ 18 పరిచయం చేస్తోంది…
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉండే తోటపాల్యం వెంకటేష్ పేరు చెబితే గుర్తొచ్చేది రంగు, రుచి, చిక్కదనం కలిగిన టీ. గుమగుమలాడే టీ చేయడంలో ఈయన దిట్ట. టి చేయడం అత్యంత కీలకమైన అనుభవం కలిగి ఉండటమే కాకుండా తన దగ్గరకు టీ తాగడానికి కూడా వచ్చే కస్టమర్లకు ఏమాత్రం టేస్ట్ తగ్గకుండా సంతృప్తి పరచాలన్నదే ఆయన లక్ష్యం. దీని కోసం వెంకటేష్ టీ పొడి ఎంపిక నుండి పాలు కాచే విధానం వరకు ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు తోటపాలెం వెంకటేష్. టీ మాస్టర్ గా కేవలం టీ మాత్రమే అందించకుండా కస్టమర్లతో నిత్యం సంభాషిస్తూ, వారి మంచి, చెడులను కూడా పంచుకుంటారు. ఈ వృత్తిలో ఒక రకమైన మానసిక తృప్తి ఉందని అంటున్నారు తోటపాలెం వెంకటేష్.
శారీరక శ్రమ రోజుకు 10 గంటల పాటు నిలబడి పనిచేయడం, వందలాది కప్పుల టీ, కాఫీలను తయారు చేయడం శుభ్రపరచడం రోజువారి భాగమైపోయిందని లోకల్18తో అంటున్నారు వెంకటేష్. అయితే ఇక్కడ రోజు టీ తాగుతూ దశాబ్దాల పాటు అలవాటుగా మారిపోయింది. ఈ టి కోసం ఏంతో దూరం నుండి వస్తున్నాం అని టీ తాగే టి అభమానులు స్థానికులు చెబుతున్నారు.
ఆయన అనుభవంతో టీ పొడి బలాన్ని (strength) పాలను వేడి చేయడంలో నిపుణతను కలిగి ఉన్న మాస్టరు. కప్పు పట్టుకోగానే టీ రుచిని చెప్పగల సామర్థ్యం ఈ టి మాస్టరు గొప్పతనం. అయితే ఈయన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉరవకొండ, హిందూపురం, పెనుగొండ, అనంతపురం, కదిరి ప్రాంతాల్లో టీ షాపులు నిర్వహించానని చెబుతున్నారు.ఈయన దగ్గర టి తాగడానికి పదుల కిలోమీటర్ల దూరం నుండి అధికంగా వస్తుంటారు. టి, కాఫీ, బూస్ట్, హార్లిక్స్, కడక్ చాయ్ ఇలా పదుల రకాల టి లభిస్తుంది వెంకటేష్ దగ్గర ఒక టి ధర 10 రూపాయలు బూస్ట్, హార్లిక్స్ 20 రూపాయలకు అమ్ముతారు వెంకటేష్ .
లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Anantapur,Anantapur,Andhra Pradesh
Mar 20, 2026 12:05 PM IST


