తెలంగాణలో 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ (SA)-2 పరీక్షలు జరగాల్సి ఉంది. ఇవి ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం షెడ్యూల్‌లో మార్పులు చేసింది. 2 రోజులు ముందుగానే పరీక్షలు మొదలయ్యేలా విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ గురువారం జీవో జారీ చేశారు. అంటే ఏప్రిల్ 8 నుంచి 18 వరకు పరీక్షలు జరుగుతాయి. టైమింగ్స్ చూస్తే.. 1 నుంచి 7వ తరగతి వరకూ ఉదయం 9 నుంచి 11:30 వరకూ, 8వ తరగతికి ఉదయం 9 నుంచి 11:45 వరకూ, 9వ తరగతికి మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 12వరకు పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్ 23న స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్ పెట్టి.. ఫలితాలు చెబుతారు.
ఇవాళ ఏమున్నాయి?
ఇరాన్ యుద్ధానికి 34 రోజులు పూర్తి అయ్యాయి. నేడు 35వ రోజు కొనసాగుతోంది. నేడు, రేపు ప్రధాని మోదీ చెన్నైలో పర్యటిస్తారు. నేటి నుంచి ఏపీ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ఉంటుంది. కానీ నేడు గుడ్ ఫ్రైడే కారణంగా అధికారులు రేపు బాధ్యతలు స్వీకరిస్తారు. తెలంగాణ పీపుల్స్ మార్చ్‌కి మూడేళ్లు. పిప్పిరిలో నేడు బహిరంగ సభ. నేడు భారత సైన్యం లోకి తారాగిరి నౌక వస్తుంది. IPLలో నేడు చెన్నై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ రా.7.30కి ఉంది. ఇవాళ రాకాస, బైకర్, కార్మెని సెల్వం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కింద ఉన్నాయి చూడండి.


