శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. ఒకే రోజులో మూడు రకాల వాతావరణ పరిస్థితులు కనిపించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వేకువ జామున మంచు కమ్ముకుని చల్లని వాతావరణం ఉండగా, మధ్యాహ్నం సమయానికి మండే ఎండలు వేధిస్తున్నాయి. ఇక సాయంత్రం వేళల్లో మేఘాలు కమ్ముకుని వర్షాలు కురవడం ప్రత్యేకంగా నిలుస్తోంది. మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు పెరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సూర్యుడు తీవ్రంగా మండిపడటంతో రోడ్లపైకి రావడానికి ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా కూలీలు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.#WeatherUpdate #srikakulam #apnews
Source link


