Last Updated:
Sri Talupulamma Temple: ఆ అడవి కొండలపై జగత్ జ్జనని లలిత స్వరూపిణి అయిన శ్రీతలుపులమ్మ అమ్మవారు కొన్నివందల సంవత్సరాల కిందట స్వయంభుగా వెలిశారు. కానీ అక్కడ అమ్మవారిని ఆరాధించేందుకు దర్శించేందుకు అధిక సంఖ్యలో ఆదివారం మాత్రమే చేరుకుంటూ ఉంటారు.
Sri Talupulamma Ammavari Temple: ఆ అడవి కొండలపై జగత్ జ్జనని లలిత స్వరూపిణి అయిన శ్రీతలుపులమ్మ అమ్మవారు కొన్నివందల సంవత్సరాల కిందట స్వయంభుగా వెలిశారు. కానీ అక్కడ అమ్మవారిని ఆరాధించేందుకు దర్శించేందుకు అధిక సంఖ్యలో ఆదివారం మాత్రమే చేరుకుంటూ ఉంటారు, నిజానికి అమ్మవారి పూజ అంటేనే శుక్రవారం ఎంతో ప్రీతిపాత్రమైనదని చెప్పుకోవచ్చు కానీ అందుకు భిన్నంగా ఆకొండ కోనల్లో వెలసిన అమ్మవారిని మాత్రం ఆదివారం భక్తులు ఎందుకు కొలుస్తారు?అమ్మవారికి అక్కడ నైవేద్యం ఏం పెడతారో తెలుసా? ఆ తర్వాత అక్కడ భక్తులు తీసుకునే ప్రసాదం ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
సుందర నందనమైన కొండ ప్రాంతం అది. కాకినాడ జిల్లాకు సంబంధించి రాజుపేట జాతీయ రహదారి నుంచి లోవ కొత్తూరు అటవీ ప్రాంతం గుండా వెళితే అద్భుతమైన అమ్మవారి ఆలయం మనకి దర్శనమిస్తుంది. ఆ ఆలయమే శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆలయం. వాడుకు భాషలో తలుపులమ్మ అని పిలుస్తూ ఉంటారు. నిజానికి మనం మనసులో అమ్మవారిని తలచుకుంటే చాలు అమ్మవారి మన సమస్య తీరుస్తుందని కాబట్టి అమ్మవారిని తలంపులమ్మ అని భక్తులు పిలిచేవారట. అటువంటి అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు ఆదివారం మాత్రమే కొలుస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన పొంగళ్ళు నైవేద్యాలుగా సమర్పించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున చేరుకుంటారు.
ఆదివారం మాత్రమే దర్శించేందుకు ఇది ఒక కారణమైతే రెండవది అమ్మవారిని దర్శించిన తర్వాత ఆ కొండ ప్రాంతంలో ఎత్తైన పచ్చని చెట్ల కింద అదే విధంగా దేవస్థాన గదులలో, వీటితో పాటు ప్రైవేటు గదుల్లో కుటుంబ సభ్యులను పిలుచుకుని బంధుమిత్రులను పిలుచుకుని భోజనాలు పెట్టుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది.ఆ భోజనాల్లో ఖచ్చితంగా నాన్ వెజ్ వంటకాలు ఉంటాయి కాబట్టి ఆదివారం అధికంగా ఈ క్షేత్రానికి వస్తారన్నది మరొక విషయంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ ప్రాంతంలో భక్తుల కోర్కెలు తీరుస్తు కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ తలుపులమ్మ అమ్మవారిని ఒక్కసారి దర్శిస్తే చాలు మన మనసులో తెలియని ఆనందం ఉంటుంది అంటున్నారు ఆలయ అర్చకులు, భక్తులు.
ముఖ్యంగా కాకినాడ జిల్లాలో అన్నవరం తర్వాత మరల శ్రీ తలుపులమ్మ అమ్మవారికి పెద్ద ఎత్తున ఆదాయం సైతం సమకూరుతుంది,ఏది ఏమైనా ఒకపక్క ఆధ్యాత్మికం మరొపక్క అద్భుతమైన ప్రకృతి సోయగాల నడుమ శ్రీ తలుపులమ్మ అమ్మవారి క్షేత్రం విరాజిల్లుతుందని చెప్పుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kakinada,East Godavari,Andhra Pradesh


