Last Updated:
పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం సమీప రామదుర్గం రాయదుర్గం రామాలయంలో సీతారాముల కళ్యాణం కోసం గిరిజనులు అడవి మార్గంలో పాదయాత్ర.
అసలే దట్టమైన అడవి, ఆ అడవిలో కొండలు, ఆ కొండపై రాములవారి గుడి, ఆలయానికి సాధారణ రోజుల్లో వెళ్లాలంటే ఏమోగానీ, రాములోరి కళ్యాణానికి మాత్రం కచ్చితంగా వెళ్లాలని గిరిజనులంతా ఎంత కష్టమైనా భరించి నడక మార్గంలో ఆలయానికి చేరుకుంటారు. ప్రస్తుతం అటవీ మార్గంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు అక్కడ కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో ఇప్పటివరకు ఈ 20 వేల మందికి పైగా గిరిజనులు అడవి కొండల్లో ఉన్న రామాలయంకు చేరుకుంటున్నారు, ఇంతకీ అడవి ఎక్కడుంది? ఆ రామాలయ చరిత్ర ఏంటి ఒకసారి క్లుప్తంగా చూద్దాం
గోదావరి జిల్లాలకు సంబంధించి పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం శివారు కొండపై సీతారాముల కళ్యాణం ఘనంగా జరుగుతుంది. నిజానికి దట్టమైన అటవీ ప్రాంతంలో ఈరామదుర్గం రామాలయం మనకి దర్శనమిస్తుంది. సాధారణ రోజుల్లో ఎలా ఉన్నా రాములోరి కళ్యాణం రోజు మాత్రం నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల గ్రామ ప్రజల గిరిపుత్రులు సైతం పెద్ద ఎత్తున రామదుర్గం కొండపైకి చేరుకుంటారు, అయితే అటవీ మార్గం గుండా ఎన్నో వాగులు వంకలు దాటుతూ కిలోమీటర్ల పొడవైన నడక మార్గంలో ఆలయానికి చేరుకుంటూ ఉంటారు.
ప్రస్తుతం అడవి సమీప ప్రాంతాల్లో ఉన్న సమస్యల నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రత పర్యవేక్షణలో రాముల వారి కళ్యాణానికి రాముల వారి ఆలయానికి వచ్చే భక్తులకి ప్రభుత్వం భద్రత కల్పించిందని చెప్పుకోవచ్చు. దట్టమైన అటవీ ప్రాంతం గుండా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దారి పొడవునా పోలీసులు మోహరించి భద్రత కల్పిస్తున్నారు. సీతారాములపై ఉన్న భక్తిశ్రద్ధలతో గిరిజనులంతా వాగులు వంకలు కొండలు దాటుతూ దేవీపట్నం మండలం శివారు ఉన్న రాములోరి ఆలయానికి చేరుకుని రాములవారి కళ్యాణాన్ని కనులారా తిలకిస్తారు.
చెప్పడం కాదుగానీ రామదుర్గంలో గల రాములు వారి ఆలయం ఆ వెళ్లే మార్గం అత్యంత రమనీయంగా ఉంటుందని చెప్పుకోవచ్చు, అటవీ ప్రాంతంలో కొనసాగే ఈ పాదయాత్ర అత్యంత ఆధ్యాత్మికంగా ఆహ్లాదంగా సాగుతుందని గిరిజనులు పేర్కొంటున్నారు. ఎటు చూసినా కొండలు ఎటు చూసినా పచ్చని చెట్లు అటవీ మార్గంలో సెలయేరుల శబ్దాల మేర భక్తులు భక్తిశ్రద్ధలతో రాయదుర్గం రామాలయానికి చేరుకుని సీతారాముల కళ్యాణాన్ని కనులారా తిలకించి రాములవారి సేవలో కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


