Last Updated:
Sri Rama Navami: మేమంతా ఒక్కటే, మీరు వేరు, మేము వేరు కాదు అనే సమానత్వాన్ని తెలియజేసేందుకు అక్కడ ముస్లింలు అంతా కలిసి సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. రాముల వారి ఆలయానికి మామిడితోరణాలు కట్టే దగ్గర నుండి కళ్యాణం ముగిసిన తర్వాత జరుగు అన్న ప్రసాద వితరణ వరకు దగ్గరుండి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.
Sri Rama Navami: మేమంతా ఒక్కటే, మీరు వేరు, మేము వేరు కాదు అనే సమానత్వాన్ని తెలియజేసేందుకు అక్కడ ముస్లింలు అంతా కలిసి సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. రాముల వారి ఆలయానికి మామిడితోరణాలు కట్టే దగ్గర నుండి కళ్యాణం ముగిసిన తర్వాత జరుగు అన్న ప్రసాద వితరణ వరకు దగ్గరుండి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఆ దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ముస్లిమ్స్ అదే విధంగా హిందువులు కలిపి నిర్వహించే కల్యాణమే రాములోరి కళ్యాణం అని అక్కడ పిలుస్తూ ఉంటారు. ఇంతకీ అలాంటి కల్యాణం ఎక్కడ జరుగుతుంది ? ఎప్పటి నుంచి ఈ సంస్కృతి ఏర్పడింది? పూర్తి వివరాలు ఈస్టోరీలో చూడండి.
ముస్లిం హిందూ భాయ్ భాయ్ అనే మాట ఎప్పటి నుండో వింటూనే ఉన్నాం. కాని ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పెద్దబోదిగలం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు జరిగిన తీరు చూస్తే కచ్చితంగా ఇది అక్షరసత్యం అంటారు. గ్రామంలో ఏటా నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణం రోజు అందరూ మతం, కులం పక్కనపెట్టి కల్యాణాన్ని వైభోగంగా నిర్వహిస్తారు. ఎక్కడైనా ఊరంతా కలిసి ఎక్కడైనా పండుగ నిర్వహిస్తారు. కానీ ముస్లిమ్స్, క్రైస్తవులు మాత్రం ఈ పండుగకు అన్ని చోట్ల దూరంగా ఉన్నప్పటికీ ఈపెద్ద బోద్ధిగలం గ్రామంలో మాత్రం ముస్లిం సైతం ఈ రాములవారి కళ్యాణంలో భక్తిశ్రద్ధలతో పాల్గొంటారు. ముస్లిమ్స్ అంటే మగవారే కాకుండా మహిళలు సైతం భక్తిశ్రద్ధలతో రాములోరి కళ్యాణంలో ఇక్కడ పాల్గొనడం ఒక ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు.
ఈ ఏడాది జరిగిన రాములోరి కల్యాణాన్ని సైతం ముస్లిమ్స్ దగ్గరుండి నిర్వహించారు. చక్కని వేదికపై సీతారాములు వారిని వేయించింపచేసి అర్చక స్వాములు శాస్త్రపర్వంగా గణపతి పూజ, పుణ్యహవచనం, కంకణ ధారణ, మాంగల్య ధారణ, తలంబ్రాలు ఘటాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్న తరుణంలో ముస్లింలు హిందువులు కలిసి ఈ కళ్యాణంలో పాలుపంచుకున్నారు. అనంతరం ఊరువాడ ఏకమై పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరన కార్యక్రమ సైతం నిర్వహిస్తున్నారు. ఏదిఏమైనా మీరువేరు మేము వేరు అన్న నినాదంకాదు మనమంతా ఒక్కటే అనే విధంగా ఇక్కడ ముస్లింస్ హిందూ కలిసి కార్యక్రమం చేయడం అందర్నీ ఆనందింప చేస్తుంది.
హిందువుల పండుగలు అయిన రాముల వారి కళ్యాణంతో పాటు సంక్రాంతి, గ్రామ దేవత నూకాలమ్మ తల్లి ఉత్సవాల్లో సైతం ముస్లింస్ పాల్గొంటారని, అదేవిధంగా ముస్లిమ్స్ పండుగలు అయిన రంజాన్, బక్రీద్ వంటి పండగల్లో హిందూ పాల్గొంటారని గ్రామస్తులు చెబుతున్నారు. తరతరాలుగా ఈ సంస్కృతి నక్కపల్లి మండలం పెద్దబోదిగలం గ్రామంలో కొనసాగుతూ వస్తోంది. మతసామరస్యానికి ప్రతీకా ఈ గ్రామం నిలుస్తోంది. సీతారాముల కల్యాణానికి హిందువులతో పాటు ముస్లింలు సైతం పాల్గొనడం ఈరోజు వచ్చిన ఆనవాయితి కాదని దశాబ్దాలుగా కొనసాగుతోందని గర్వంగా చెబుతున్నారు.
Anakapalle,Visakhapatnam,Andhra Pradesh


