Sports Competition: డ్రాగన్ బోట్ రేసులో విశాఖ క్రీడాకారుల సత్తా.. కేవలం 6 సెకన్ల తేడాతో నాలుగో స్థానం కైవసం.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విజయవాడ రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోట్ పోటీల్లో వైజాగ్ జట్టు తొలి పాల్గొనికే 6 సెకన్ల తేడాతో నాలుగో స్థానం, కోచ్ సదుపాయాలు ఇస్తే అంతర్జాతీయ పతకాలు సాధ్యమని నమ్మకం

విజయవాడలో రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోట్ పోటీలు..!
విజయవాడలో రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోట్ పోటీలు..!

విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోట్ పోటీలలో విశాఖపట్నం జట్టు తొలిసారిగా పాల్గొని ప్రతిభ కనబరిచింది. సీనియర్ జట్లతో సమానంగా పోటీపడి కేవలం 6 సెకన్ల తేడాతో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా క్రీడాకారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఇది తమకు అద్భుతమైన అనుభవంగా నిలిచిందని తెలిపారు. పరిమిత వనరుల మధ్య ఇంత మంచి ప్రదర్శన ఇవ్వడం తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు.

జిల్లా జల క్రీడల కోచ్ వి. దాసారావు మాట్లాడుతూ, విశాఖపట్నంలో డ్రాగన్ బోట్లు లేకపోయినా 14 మంది క్రీడాకారులతో పోటీపడవలసి వచ్చిన పరిస్థితిని వివరించారు. క్రీడాకారుల కొరత కారణంగా కేవలం 8 మందితోనే సరైన ప్రాక్టీస్ లేకుండా పోటీలో పాల్గొనాల్సి వచ్చిందన్నారు. అయినప్పటికీ, 14 మంది జాతీయ స్థాయి క్రీడాకారులతో పోటీ పడి కేవలం 6 సెకన్ల తేడాతో వెనుకబడటం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. విశాఖపట్నం క్రీడాకారులకు సరైన సదుపాయాలు, ముఖ్యంగా డ్రాగన్ బోట్లు అందించి సమగ్ర శిక్షణ ఇవ్వగలిగితే, వారు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే సామర్థ్యం కలిగి ఉన్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జట్టు సభ్యులందరినీ కోచ్ అభినందించి, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆంద్రప్రదేశ్ స్టేట్ కాయకింగ్ కనోయింగ్ ప్రెసిడెంట్ బలరాం నాయుడు మాట్లాడుతూ వైజాగ్ క్రీడాకారులు అధితమైన ప్రదర్శన చేసారని వీరికి డ్రాగన్ బాట్తో ప్రాక్టీస్ చేయిస్తే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు పంట పండిస్తారని అన్నారు.

క్రీడల్లో పాల్గొని ఉన్నత ప్రతిభ చూపించిన వారికి డీఎస్‌డీఓ శ్రీమతి జూన్ క్రీడాకారులు ని అభినందించారు. నేటి తరం యువత ప్రతి క్రీడల్లో పాల్గొని రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం నిలిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్క యువత మంచి స్కిల్ నేర్చుకొని ప్రతి రంగంలోనూ మంచి ఉత్తీర్ణత సాధించాలని ఈ సందర్భంగా తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *