Soda Shop: 1957 నుంచి నేటికీ మారని రుచి.. నెల్లిమర్ల రహదారిపై ఆగే ప్రతి వాహనానికీ ఈ సోడాయే ప్రాణం! ధర ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు |


Last Updated:

విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 1957లో కొండ్రు రాములు ప్రారంభించిన గోళీ సోడా దుకాణం ఇప్పటికీ రుచి, సంప్రదాయంతో ప్రసిద్ధి, ఇప్పుడు కొండ్రు రమణ నిర్వహిస్తున్నారు

+

కాణీ

కాణీ నుంచి రూ.2 వరకు… సోడా ధరల ప్రయాణం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన గోళీ సోడా దుకాణం ఇప్పటికీ స్థానికులను, ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. 1957లో కొండ్రు రాములు ప్రారంభించిన ఈ చిన్న సోడా దుకాణం, కాలానుగుణ మార్పులతో ముందుకు సాగుతూ కుటుంబానికి జీవనాధారంగా నిలిచింది. ప్రస్తుతం ఈ దుకాణాన్ని ఆయన కుమారుడు కొండ్రు రమణ నిర్వహిస్తున్నారు.

మా తండ్రి ప్రారంభించిన ఈ దుకాణం మీదే మా కుటుంబం అంతా ఆధారపడి జీవిస్తోందని తెలిపారు. ఇక్కడ తయారయ్యే గోళీ సోడా రుచిని ఒక్కసారి తాగిన వారు మళ్లీ మళ్లీ వస్తుంటారని రమణ తెలిపారు. ఆ మార్గంలో వెళ్లే ప్రతి వాహనదారుడు ఈ సోడా రుచి చూడకుండా వెళ్ల లేదని ఆయన చెప్పారు. రోజువారీగా వందల సంఖ్యలో సోడాలు అమ్ముడవుతున్నాయని, ముఖ్యంగా వేసవి కాలంలో డిమాండ్ మరింతగా పెరుగుతుందని తెలియజేశారు.

మే, నెలలో ఫుల్లు డిమాండ్ ఉంటుందని తెలిపారు. సోడా ధరల మార్పుపై ఆయన ఆసక్తికర వివరాలు వెల్లడించారు. 1957లో కాణీ ధరకు ప్రారంభమైన ఈ సోడా, ఆ తరువాత అర్ధానా, 1983 నాటికి 5 పైసలు ధరకు విక్రయించారు. కాలక్రమేణా 10 పైసలు, 25 పైసలు, 50 పైసలు, ఒక రూపాయి వరకు ధరలు పెరిగాయని తెలిపారు. “గత రెండేళ్ల క్రితం నుంచి ఒక్క సోడాకు 2 రూపాయల ధర నిర్ణయించాం. ధర పెరిగినా డిమాండ్ మాత్రం తగ్గలేదు” అని అన్నారు.

పాత రోజుల్లో పెద్ద గోలెంలలో గంటల తరబడి సోడాలను ఉంచి చల్లబరచేవారని, ప్రస్తుతం ఫ్రిజ్ బాక్సులను ఉపయోగిస్తున్నామని చెప్పారు. దీంతో విద్యుత్ వినియోగం పెరిగి ఖర్చులు అధికమయ్యాయని తెలిపారు. అయినప్పటికీ, రుచిలో ఎలాంటి మార్పు లేకుండా అదే నాణ్యతను కొనసాగిస్తున్నామని రమణ పేర్కొన్నారు.

ఈయన తండ్రి కొండ్రు రాములు 2023లో మరణించగా, అప్పటి నుంచి ఈ దుకాణాన్ని రమణ బాధ్యతగా నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబంలో ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నెల్లిమర్ల గోళీ సోడా ప్రత్యేకత మాత్రం తగ్గలేదు. స్వచ్ఛమైన రుచి, సంప్రదాయం కలిసిన ఈ సోడా ఇప్పటికీ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఈ చిన్న దుకాణం ఒక కుటుంబానికి మాత్రమే కాదు, ఒక ప్రాంతానికి గుర్తింపుగా నిలిచింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *