Last Updated:
Social Media Ban: ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలకు సోషల్ మీడియాని బ్యాన్ చేసే విషయంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. పైగా నిన్న మంత్రులతో చర్చల్లో మంత్రి నారా లోకేష్ స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ కాబోతోంది. ఇప్పుడే కాదు. దీనిపై గైడ్‌లైన్స్ రెడీ చేసి, ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేస్తారు. ఇందుకు సంబంధించి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. నిన్న ఆయన మంత్రుల బృందం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో అశ్లీలత పెరుగుతోంది. అలాగే సైబర్ నేరాలూ ఎక్కువవుతున్నాయి. 16 ఏళ్ల లోపు పిల్లలకు ఏది మంచో, ఏది చెడో ఆలోచించేంత మెచ్యూరిటీ ఉండకపోవచ్చు. కొంతమంది పిల్లలు.. సోషల్ మీడియాలోని తప్పుడు ప్రచారమే నిజం అని నమ్మే ప్రమాదం ఉంటుంది. ఇలా వాళ్లు తప్పుదారి పట్టకుండా ఉండాలంటే.. వారికి సోషల్ మీడియాను దూరంగా ఉంచడమే బెటర్ ఐడియా అని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే.. 13 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్‌పై బిల్లు రెడీ చెయ్యాలని లోకేష్ ఆదేశించారు.
* పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేస్తే, ఏజ్ కన్ఫర్మేషన్ అడగవచ్చు.
* తల్లిదండ్రులు కూడా పిల్లలకు సోషల్ మీడియాను అందుబాటులో ఉంచకుండా కండీషన్లు పెట్టవచ్చు.
* సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు తమ వ్యూవర్స్ డేటాని ప్రభుత్వానికి ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు.
సోషల్ మీడియా అనేది రెండువైపులా పదునున్న కత్తి లాంటిది. దాని ద్వారా అసత్య ప్రచారాలు, మహిళల పట్ల విధ్వేష పూరిత వ్యాఖ్యలు, అశ్లీల, మార్ఫింగ్ వీడియోల లాంటివి షేర్ అవుతున్నాయి. మరోవైపు ఇదే సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీ, ప్రముఖులు, సెలబ్రిటీలూ, నాసా లాంటి సంస్థలు.. ప్రజలకు చేరువవుతున్నాయి. అందువల్ల పిల్లలకు పూర్తిగా బ్యాన్ చేస్తే, వారికి వచ్చే నాలెడ్జ్ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి.. ఈ విషయంలో ప్రభుత్వం అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకొని.. రూల్స్ తేవాల్సిన అవసరం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



