Snake Bite: పాముల్ని పగబట్టిన పెద్దాయన.. పాతిక సార్లు కాటేసినా తగ్గేదేలే..! | ట్రెండింగ్


Last Updated:

Snake Catcher Story: పాముని చూస్తేనే ఎవరైనా భయపడతారు. అదే పాము కాటేస్తే జన్మలో పాము పేరు ఎత్తడానికి సాహసించరు. కాని ఈ పెద్దాయన ఇందుకు పూర్తిగా విరుద్దం.

snake catcher story
snake catcher story

Snake Catcher: పాములు జనావాసాల మధ్య తిరిగే ప్రమాదకరమైన జీవులు. అయితే అవి కంట పడనంత వరకు ఎంతటి వారైనా ధైర్యంగానే ఉంటారు. ఒక్కసారి కంటి ముందు పాము కనిపిస్తే చాలు.. ఎంతటి ధైర్యవంతుడికైనా సరే చమటలు పట్టాల్సిందే. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఓ వ్యక్తి పాముల్ని పడుతూ బాగా పాపులర్ అయ్యాడు. విచిత్రం ఏమిటంటే ఎవరినైనా పాములు పగపట్టడం చూశాం. అలా పాములు పగబట్టాయని భయపడిన వాళ్ల గురించి విన్నాం. కాని మొట్టమొదటి సారి పాముల్ని పగబట్టిన వ్యక్తి గురించి మీకు తెలియజేస్తున్నాం. అతని పేరు వేమవరపు సుధాకర్. 60ఏళ్లకుపైగా వయసు పైబడిన వృద్ధుడు. ఈయన స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట. సుధాకర్ పేరు చెబితే కాటేసేందుకు పాములు కూడా భయపడతాయి. ఎందుకంటే అతడ్ని ఇప్పటికే పాతిక సార్లు విషసర్పాలు కాటేసినప్పటికి ఏమాత్రం భయం, బెరుకు లేకుండా పాము కాటు నుంచి ప్రజల్ని రక్షిస్తున్నాడు. అసలు ఆయన గురించి మొత్తం తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే.

15వేల పాముల్ని పట్టాడు..

పాముని చూస్తేనే అందరికి భయం. కాని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన వేమవరపు సుధాకర్ మాత్రం పాముల నుండి ప్రజల్ని రక్షించడమే హాబీగా పెట్టుకున్నారు. చిన్నప్పటి నుండి విషసర్పాలను సైతం సులువుగా పట్టే సుధాకర్ ఇప్పటి వరకు 15వేల పాముల్ని పట్టుకున్నాడు. ఈక్రమంలోనే ఆయన 27 సార్లు పాము కాటుకు గురయ్యాడు. అయినా భయపడకుండా పాము కాటు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, పాము కరిసిన వారికి వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించడం వంటి సేవలను కూడా సుధాకర్ అందిస్తున్నారు.

పాములనే పగబట్టిన పెద్దాయన..

జగ్గయ్యపేట పట్టణంలో ఉంటూ కేసీపీ సిమెంట్‌ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్న సుధాకర్ ఇప్పటివరకు సుమారు 20 మందిని పాము కాటు నుంచి రక్షించినట్లుగా తెలిపారు. జనావాసాల మధ్యకు వచ్చే ప్రాణాంతక పాములు, విషసర్పాలను పట్టుకొని వాటిని దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం చేస్తుంటారు. సుధాకర్ చేస్తున్న సేవలను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు. అయితే తనను పాము కాటు వేసిన ప్రతీ సారి భయపడకుండా విషం ఎక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్చుకున్నట్లుగా తెలిపారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత చికిత్స చేసుకున్న సుధాకర్ మరికొన్ని సార్లు ఆసుపత్రికి వెళ్లి ట్రీట్‌మెంట్ పొందినట్లుగా తెలుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *