Last Updated: Mar 19, 2026, 18:09 IST
వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం నందు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజున ఉదయం శ్రీస్వామివారికి విశేష అర్చన, ఉగాది పచ్చడి నివేదన, మంగళాశాసనములు జరిగాయి. స్వామివారికి నివేదించిన ఉగాది పచ్చడి భక్తులకు పంచుట జరిగింది. శ్రీ స్వామివారి సన్నిధిలో ఉదయం ఆరాధనం, రాజభోగం, దేవాలయ ప్రధాన అర్చకులు వారిచే ఆస్థాన మండపంలో పంచాంగ పఠనం జరిగింది. స్వామివారి నిత్య కళ్యాణం , తెల్లవారుజామున ఘనంగా స్వర్ణ పుష్పార్చిన జరిగింది.
#Simhachalam #Ugadi2026 #NarasimhaSwamy


