Last Updated:
Extramarital Affair: మానవీయ విలువలు మంటగలిసిపోవడమే కాదు చివరకు మాతృత్వ ప్రేమలు కూడా తగలబడిపోతున్నాయి. నవ మాసాలు మోసి కని పెంచిన తల్లికే బిడ్డ భారమవుతున్న పరిస్థితులు ఉన్నాయి.
Extramarital Affair: మానవీయ విలువలు మంటగలిసిపోవడమే కాదు చివరకు మాతృత్వ ప్రేమలు కూడా తగలబడిపోతున్నాయి. నవ మాసాలు మోసి కని పెంచిన తల్లికే బిడ్డ భారమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. తమ తాత్కాలిక శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం కొందరు, పరాయి వ్యక్తుల మోజులో పడి ఇంకొందరు పిల్లల్ని చంపేస్తున్న సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైపోయాయి. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో జరిగిన ఈ దారుణం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తిరుపతిలోని పోస్టల్ కాలనీలో నివాసముంటున్న ఆశాలత అనే 19ఏళ్ల యువతికి గతంలో వివాహం జరిగినప్పటికీ భర్తతో విభేదాలు రావడంతో 3ఏళ్ల వయసున్న తన కుమార్తె దుర్గను తీసుకొని తల్లి వద్ద నివసిస్తోంది. ఈ క్రమంలో ఏర్పేడు మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ తర్వాత ఏమైందో తెలిస్తే షాక్ అవుతారు.
ఆశాలత అనే యువతి మొదటి వివాహం తెగతెంపులు చేసుకుంది. తన బిడ్డతో తల్లి దగ్గర ఆశ్రయం పొందుతున్న సమయంలో ఏర్పేడు మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన యువకుడికి దగ్గరైంది. ఇద్దరూ సహజీవనం కొనసాగిస్తూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే తమ పెళ్లికి కడుపున పుట్టిన బిడ్డ అడ్డుగా మారుతుందని భావించిన ఆశాలత అమానుషంగా తన సొంత బిడ్డను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని పాపానాయుడుపేట నుంచి చెన్నంపల్లి వెళ్లే మార్గంలో ఉన్న స్వర్ణముఖి నది సమీపంలోని వెలవెలబోయిన ప్రదేశంలో పూడ్చిపెట్టినట్లు తేలింది.
ఆశలత తల్లి ఈనెల 19వ తేదీ నుంచి తన మనవరాలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆశాలత ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దాంతో కూతుర్ని హత్య చేసినట్లుగా స్వయంగా ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆశలత ఇచ్చిన సమాచారం మేరకు చిన్నారి మృతదేహాన్ని కనుగొనేందుకు తహసిల్దార్ సమక్షంలో నిందితులను వెంట తీసుకుని పోలీసులు ఏర్పేడు తహసిల్దార్ భార్గవి, వీఆర్వోలు సమక్షంలో పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని తవ్వించి చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు.
అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చట్టపరమైన చర్యలుఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రేమ పేరుతో అమాయక చిన్నారి ప్రాణాన్ని బలిగొన్న ఈదారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తల్లి చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి విషాదం ప్రాంతంలో చర్చనీయాంశమైంది. వివాహేతర సంబంధం మోజులో కుటుంబ సంబంధాలు, మానవీయ విలువలు ఎక్కడికి పోతున్నాయో అనే ప్రశ్నలు ఈ ఘటనతో మరోసారి వేలెత్తిచూపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirupati,Chittoor,Andhra Pradesh
Feb 25, 2026 12:33 PM IST


