Last Updated:
Shocking Family Incident: ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదం, మద్యం తాగిన భర్త, తాను ఏం చేస్తున్నాడో మరిచిపోయాడు. చివరికి అభం శుభం తెలియని 11నెలల చిన్నారిని పొట్టన పెట్టుకున్నాడు.
Shocking Family Incident: ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదం, మద్యం తాగిన భర్త, తాను ఏం చేస్తున్నాడో మరిచిపోయాడు. చివరికి అభం శుభం తెలియని 11నెలల చిన్నారిని పొట్టన పెట్టుకున్నాడు. అది తన ద్విచక్ర వాహనంపై అడ్డుఅదుపు లేకుండా గాలిలో ప్రయాణిస్తూ తిన్నగా నదిలోకి బండితో కలిపి దూకే విధంగా దూసుకుపోయాడు. ఈ ఘటనలో అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు విడిచింది. అసలేం జరిగింది? పోలీసులు ఏం చెబుతున్నారు? ఒకసారి వివరాలు చూద్దాం.
ఏపీకి సంబంధించి కాకినాడజిల్లా జగ్గంపేట ప్రాంతానికి చెందిన ఓడిపోయిన మణికంఠ ఏడాదిన్నర క్రితం శీలం సాయమ్మ అనే మహిళను రెండవ వివాహం చేసుకున్నట్లుగా ప్రతిపాడు సిఐ బి.అప్పారావు తెలియచేశారు. వీరిద్దరి దాంపత్య జీవితంలో 11 నెల చిన్నారి ఉందని, ఆపాపకి నామకరణం సైతం చేయలేదని సీఐ తెలిపారు.. ముఖ్యంగా మణికంఠ మద్యం సేవించి భార్యతో గొడవ పడుతూ ఉండేవాడని పోలీసులు తెలిపారు, ఇలాంటి తరుణంలో తాజాగా భార్యాభర్తల మధ్య ఈ గొడవ కాస్త ఎక్కువ కావడంతో తనకు పుట్టిన బిడ్డను ఇవ్వాలంటూ 11 నెలల చిన్నారిని బైక్పై ఎక్కించుకుని మణికంఠ ప్రయాణమయ్యాడు, అయితే మణికంఠ అమ్మగారింటికి గాని చిన్నారిని తీసుకెళ్తున్నాడేమో అని చిన్నారి తల్లి అయినా సాయమ్మ ఊరుకుందని స్థానికులు తెలిపారు.ఇలాంటి తరుణంలో ఊహించిన పరిణామం ఏర్పడింది, 11 నెల చిన్న పాపతో బైక్ పై వెళ్లిన మణికంఠ నేరుగా జగ్గంపేట సమీపంలో ఉన్న నదిలోకి బైకు చిన్నారితో సహా దూకాడు.
ఈ ప్రమాదంలో స్థానికులు మణికంఠను రక్షించగా 11 నెల చిన్నారి మాత్రం ప్రాణాలు విడిచింది, విషయం తెలుసుకున్న బాధిత కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. ఈఘటనకు సంబంధించి భార్య సాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేవలం 12 గంటలు లోపే భర్త మణికఠను అరెస్ట్ చేసినట్లుగా ప్రత్తిపాడు సిఐ అప్పారావు మీడియా సమావేశంలో తెలిపారు.
భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం, భర్తలు ఇష్టారాజ్యంగా మద్యం సేవించి భార్యలను హింసించడం, ముఖ్యంగా అనుమానం అనే పెనుభూతం భార్యాభర్తల మధ్య దాపరించడంతో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.నిజానికి ఈ ఘటనలో సంబంధం లేని చిన్నారులను కని పెంచిన తల్లిదండ్రులే పొట్టన పెట్టుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈమధ్యకాలంలో తల్లిదండ్రులు ఆలోచనలు కావచ్చు, లేదా తొందరపాటు నిర్ణయాలు కావచ్చు, సంబంధం లేని చిన్నారులను బలవంతంగా తల్లిదండ్రులే చంపేస్తున్న ఘటనలు గోదావరి జిల్లాలో అధికంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kakinada,East Godavari,Andhra Pradesh
Feb 27, 2026 10:06 AM IST


