Sanitation Workers Strike: నగరవాసులకు అలర్ట్.. ఈ ఒక్కరోజు చెత్త పారేయొద్దు..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

Visakhapatnam: మహా విశాఖ నగరపాలక సంస్థ (GVMC) పరిధి లోని నగరవాసులందరికీ ఫిబ్రవరి 12న అంటే గురువారం కాస్త ఇబ్బందికరమైన రోజు. నగరం మొత్తం కూడా ఎక్కడా ఎవరూ చెత్త పారేసినా అది ఇబ్బందులకు దారితీస్తుంది.

Rapid Read
sanitation workers strike
sanitation workers strike

Visakhapatnam: మహా విశాఖ నగరపాలక సంస్థ (GVMC) పరిధి లోని నగరవాసులందరికీ ఫిబ్రవరి 12న అంటే గురువారం కాస్త ఇబ్బందికరమైన రోజు. నగరం మొత్తం కూడా ఎక్కడా ఎవరూ చెత్త పారేసినా అది ఇబ్బందులకు దారితీస్తుంది. మరి ముఖ్యంగా ఫిబ్రవరి 12న ఉదయం నుంచి సాయంత్రం దాకా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు ఈ క్రమంలో ఎక్కడా కూడా చెత్త పారేయవద్దని స్వయంగా కమిషనరే అభ్యర్థించారు.

అలాగే ఇంట్లోనే చెత్తా చెదారం ఉంచలేని ప్రజలు..

జీవీఎంసీ ఏర్పాటు చేసిన భారీ చెత్త ట్యాంక్ లని మాత్రమే వాడాలని అలాగే ఎక్కడికక్కడ చెత్త ఉన్నా చెత్త డస్ట్ బిన్లు ఉన్న వాటినే విసర్జనక వినియోగించాలని కోరారు. పరిసరాల్లో ఎక్కడా పడేయకుండా ఎక్కడైనా చెత్త సేకరణ వాహనాల నిర్వహణ వారికి అందిచాల్సినదిగా కోరారు. ఫిబ్రవరి 12న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఉంది. మహా విశాఖ నగర పాలక సంస్థ నివాసితులు వ్యర్థాలు బహిరంగ ప్రదేశాలలో వేయొద్దని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు.

విశాఖపట్నంలో..

ఫిబ్రవరి 12వ తేదీన, గురువారం దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నందున మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు తమ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో వేయరాదని బుధవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ నగర ప్రజలకు తెలియజేశారు. జీవీఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు ఫిబ్రవరి 12 అనగా గురువారం సమ్మెలో పాల్గొంటున్న కారణంగా విధులకు హాజరు కానందున ఆ ఒక్క రోజు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో పడవేయరాదని, మరుచటి రోజు అనగా ఫిబ్రవరి 13 శుక్రవారం తమ వద్దకు వచ్చే పారిశుధ్య కార్మికులకు లేదా క్లాప్ వాహనాలకు వ్యర్ధాలను అందించగలరని జీవీఎంసీ కమిషనర్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

డిమాండ్స్ ఇవే..

అటు లీవులు, పని గంటలు, ఓవర్ టైం, వారాంతపు సెలవులు, జాతీయ పండగ సెలవులు, పనిప్రదేశంలో భద్రత, ఆరోగ్య సౌకర్యాలు అమలు కాకుండా తాము అనుకున్నంత కాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేసే అధికారం ఇచ్చిన లేబర్ కోడ్స్ రద్దు కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగుల అసోసియేషన్లు ఇచ్చిన 2026 ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని కార్మికులని పలు సంఘాలు కోరుతున్న నేపధ్యంలో స్వచ్ఛందంగా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పారిశుద్ధ కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటున్నారు. ఒకరోజు అంటే రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఈ సమ్మె జరిగే అవకాశం ఉంది. దీంతో ఆ మరుసటి రోజు అంటే తిరిగి శుక్రవారం నుంచి మరోసారి సమ్మె విరమించి అటు పరిశుద్ధ కార్మికులు పనుల్లో చేరే అవకాశం ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *