ఎత్తైన కొండ, బాబావారి ఆలయం, మరొకక్క బాబా వారి స్తూపం, అంతకుమించి బాబావారి చతుర్ముఖ రూప భారీ విగ్రహం, ఆకొండ చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రతి గురువారం బాబావారి సన్నిధానంలో అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తూ ఉంటారు, అలా అన్న ప్రసాదం పెట్టేందుకు భక్తులు పోటీపడతారని ఇక్కడ సాయి భక్తులు చెబుతున్నారు, ప్రధానంగా బాబావారి చెవిలో మధ్యాహ్నం సమయంలో మూడు కోరికలు తెలియజేస్తే మూడు నెలలు తిరగకుండా రెండు కోరికలు ముందు తీరుతాయంటూ నిర్వాహకులు చెబుతున్నారు.



