Road Accident: హైవేపై గాయపడిన వ్యక్తిని కాపాడాలని వెళ్లారు.. కర్నూలులోనే ఎందుకిలా..? | కర్నూల్ వార్తలు (Kurnool News)


Last Updated:

Road Accident: ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ముగ్గురు ప్రాణాలను గాల్లో కలిపేసింది. నిజానికి ఆ ప్రమాదంలో ఒక్కరే ప్రాణాలు కోల్పోయినప్పటికి .. వారికి ఏమైందో అనే కంగారులో చూసేందుకు దగ్గరికి వెళ్లిన వారిని సైతం మరో వాహనం ఢీకొట్టడంతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

+

కర్నూలులో

కర్నూలులో ఘోర ప్రమాదం ఒకరిని కాపాడేందుకు వెళ్లి మరో ఇద్దరు బలి

Road Accident: ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ముగ్గురు ప్రాణాలను గాల్లో కలిపేసింది. నిజానికి ఆ ప్రమాదంలో ఒక్కరే ప్రాణాలు కోల్పోయినప్పటికి .. వారికి ఏమైందో అనే కంగారులో చూసేందుకు దగ్గరికి వెళ్లిన వారిని సైతం మరో వాహనం ఢీకొట్టడంతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాన్ని రక్షించేందుకు వెళ్లిన మా ఇద్దరు కుమారులు చనిపోయారు అంటూ చనిపోయిన ఇద్దరి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు. నమ్మశక్యంగా లేని ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, ప్రమాదానికి కారణాలు ఇలా ఉన్నాయి.

జిల్లాలో రెండో ప్రమాదం..

ఆమధ్య కర్నూలు జిల్లాలో రన్నింగ్ లో ఉన్న బస్సులో మంటలు చెలరేగి 20 మందికిపైగా సజీవదహనం అయ్యారు. ఈ విషాధ ఘటన ఇంకా మర్చిపోక ముందే మళ్లీ కర్నూలు జిల్లాలోనే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాజాగా కర్నూలు జిల్లాలోని కృష్ణనగర్ జాతీయ రహదారి వంతెనపై అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. నిజానికి ఈ ప్రమాదంతో సంబంధంలేని ఇద్దరు వ్యక్తులు ఉండటం ఇక్కడ అందర్ని బాధించే విషయం.

హైవేపై ముగ్గురు మృతి..

కృష్ణానగర్ నేషనల్ హైవే వంతెనపై మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరినీ ఒక వాహనం ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న కుమారి శేఖర్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ప్రమాదాన్ని చూసి అటుగా వెళుతున్న పలువురు స్థానికులు అయ్యో ఏం జరిగిందో అనే ఆత్రుతతో దగ్గరికి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇలాంటి తరుణంలో మరొక లారీ వచ్చి సహాయక చర్యలు చేపడుతున్న వారందరిపై దూసుకు వెళ్ళింది. నిజానికి ఇది అత్యంత విషాదకర ఘటన చెప్పుకోవచ్చు. ఇలా లారీ దూసుకు వెళ్లడంతో బండారి కన్నాతో పాటు మరో యువకుడు సైతం ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. మరి కొంతమంది గాయాలు పాలయ్యారు. వీరందరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా కర్నూలు ప్రమాదంలో ముగ్గురు చనిపోవడంతో కర్నూలు వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

వెంటాడిన మృత్యువు..

మరోపక్క నంద్యాల హైవేపై ట్రావెల్స్ బస్సుకు భారీ రోడ్డు ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ తెల్లవారుజామున 1 30 గంటల సమయంలో నంద్యాల సమీపంలో  హైవేపై తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న మార్నింగ్ స్టార్ ఏసి స్లీపర్ బస్సు ముందు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్‌ని దాటి పంట పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో పదిమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మొత్తం బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. నంద్యాల పోలీసులు స్పాట్‌కి చేరుకుని ప్రయాణికులను గమ్యస్థానానికి పంపించే ఏర్పాట్లు చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *