Record Temperatures: రికార్డ్ స్థాయిలో ఎండలు.. రోడ్లపై నిప్పుల కురిసినట్లే ఉంది అక్కడ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

Record Temperatures: ఏపీకి సంబంధించి బానుడు రికార్డు స్థాయిలో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటలకే రోడ్లపైకి రావాలంటే భయందోళ  చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన సెంటర్లో ఈ ఎండ దాటికి వెలవెలబోతూ కనిపిస్తున్నాయి.

+

ఏపీలో

ఏపీలో రికార్డ్ స్థాయిలో బానుడి ప్రతాపం.. రోడ్లపై నిప్పు రవ్వలు

Record Temperatures: ఏపీకి సంబంధించి బానుడు రికార్డు స్థాయిలో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటలకే రోడ్లపైకి రావాలంటే భయందోళ  చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన సెంటర్లో ఈ ఎండ దాటికి వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. ఈఎండ ప్రభావం కొన్నిజిల్లాల్లో ఈవిధంగా ఉండగా, కొన్ని జిల్లాల్లో ఎండవర్షం విభిన్న వాతావరణం సైతం చోటు చేసుకుంటుంది. ఏదిఏమైనా ఎండా కారణంగా స్కూల్ విద్యార్థులు సైతం ఇబ్బందులు పాలవుతున్నారు. నిత్య కార్మికులు పచ్చనిచెట్ల కింద సేదతీరుతున్నారు. ఇంతకీ ఏపీలో అలాంటి పరిస్థితి ఎక్కడుంది?ప్రజలు ఎండ దాటికి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఒకసారి క్లుప్తంగా చూద్దాం

వేసవి సెగలు మొదలు..

గోదావరి జిల్లాలో భానుడి ప్రతాపం రోజురోజుకీ పెరిగిపోతుంది. ఉదయం 10 దాటితే రోడ్డుపైకి రావాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిత్యం రద్దీగా ఉండే కాకినాడ ప్రధాన సెంటర్లన్నీ వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. దాహాన్ని తట్టుకోలేక ప్రజలు శీతల పానీయాలు దుకాణాల వద్దకు క్యూ కడుతున్నారు. పచ్చని చెట్లకింద కార్మికులు సేద తీరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఇక ఏప్రిల్ మొదటి వారంలోనే ప్రభావం అత్యధికంగా కాకినాడ, కోనసీమ, రాజమండ్రి ప్రాంతాలలో చూపించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు ఎండింగ్ వచ్చిన నేపథ్యం మిగిలిన తరగతి విద్యార్థుల వంటిపూట సెలవులు అయినప్పటికీ, మధ్యాహ్నం ఇంటికి వచ్చే సమయంలో సైతం ఈఎండ దాడికి అలమటిస్తున్నారని చెప్పుకోవచ్చు. రోడ్డుపై వచ్చేవారంతా టవల్స్ లేదా మహిళలు చున్నీలు కప్పుకునే ప్రయాణాలు చేస్తున్నారు

విజయవాడ పరిసర ప్రాంతాల్లో విభిన్న వాతావరణం..

రికార్డ్ స్థాయిలో ఎండలు..

గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో విభిన్న వాతావరణం నెలకొంటుంది, కాస్తే విపరీతమైన ఎండ లేదంటే వాతావరణం మారి చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ వాతావరణంలో ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదిఏమైనా ఏపీవ్యాప్తంగా బానుడు ప్రతాపం కనిపిస్తుంది. ముఖ్యంగా కొబ్బరి బొండాలు, చల్లని మజ్జిగతో పాటు జూస్లు తాగేందుకు దుకాణాల వద్దకు ప్రజలు చేరుకుంటున్నారు. ముఖ్యంగా నిత్యకార్మికులు రిక్షాకార్మికులు వారికి ఎటువంటి వ్యాపారాలు పనులు లేక పచ్చనిచెట్ల కిందకు వారి వాహనంతో సైతం చేరుకుని సేద తీరుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *