Rain Alert: సమ్మర్‌లో వాతావరణ శాఖ చల్లని కబురు.. మార్చి 18 నుండి 3 రోజుల పాటు అక్కడ వర్షాలు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోనుండి. మార్చి నెలలోనే వేసవి కల్పిస్తున్న నేపథ్యంలో చల్లటి వాతావరణం ఏర్పడింది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయి అని విశాఖ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

ఏపీలో వాతావరణ శాఖ చల్లటి తీపి కవరు..? మార్చి 18 నుండి మూడు రోజులపాటు వర్షాలు
ఏపీలో వాతావరణ శాఖ చల్లటి తీపి కవరు..? మార్చి 18 నుండి మూడు రోజులపాటు వర్షాలు

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోనుండి. మార్చి నెలలోనే వేసవి కల్పిస్తున్న నేపథ్యంలో చల్లటి వాతావరణం ఏర్పడింది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయి అని విశాఖ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.  ఏపీలో దక్షిణ కోస్తా , ఉత్తరకొస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిస్తే అని అంటున్నారు.

ఎండాకాలంలో వర్షాలు..

ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ విధంగా వర్షాలు పడతాయి అని తెలిపారు. మార్చి 18తేదీ నుండి తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. మార్చి 19 , 20 వ తేదీన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. 21 పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది అని తెలిపారు. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో గంటకు 30-50KM కిలోమీటర్ల వేగంతో గాళ్లు వీస్తాయని తెలిపారు. మూడు రోజులు పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా వాతావన సాగ అధికారులు తెలిపారు.

వెరైటీ వెదర్..

ఏపీలోని ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలు తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, నెల్లూరు కొన్ని జిల్లాల్లో తేలిక పాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉందని తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈదురు గాలులు వీచే సమయంలో చెట్లు కింద ఉండరాదని తెలిపారు. పిడుగులు పడే సమయంలో సురక్ష ప్రాంతాల్లో ఉండాలని బహిరంగ ప్రదేశాల్లో ఉంటే నేల పైన పడుకోవాలని జాగ్రత్తలు తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *