Last Updated:
Rain Alert: ఏపీలో భిన్న వాతావరణం ఉంటుంది. రానున్న రెండు రోజులు పాటు ఏపీలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు.
Rain Alert: ఏపీలో భిన్న వాతావరణం ఉంటుంది. రానున్న రెండు రోజులు పాటు ఏపీలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర -పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు పడతాయని తెలిపారు. రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. వీటి ప్రభావంతో ఏపీలో రెండు రోజులు పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
రానున్న రెండు రోజులపాటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ వర్షాలు పడతాయని తెలిపారు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పుడు ఇటువంటి ఇటువంటి అకాల వర్షాలు పడతాయని తెలుపుతున్నారు. మరోవైపు అధికంగా ఉదయం సమయంలో ఎండల ఉంటాయని జాగ్రత్తలు వహించాలని తెలిపారు. ఉదయం ఎండ సాయంత్రం వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు.
ఏపీలో రానున్న ఐదు రోజులపాటు ప్రజల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పిడుగులు పడే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడుతున్నాయని ప్రజలందరూ కూడా చెట్ల కింద ఉండరాదని తెలిపారు. వర్షం పడే సమయంలో అధికంగా పిడుగులు పడేటప్పుడు నేలపై పడుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Visakhapatnam,Andhra Pradesh


