Last Updated:
Rain Alert: ఏపీలో రానున్న 5 రోజులు పాటు తేలికపాటి నుండి ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ తెలిపారు.
Rain Alert: ఏపీలో రానున్న 5 రోజులు పాటు తేలికపాటి నుండి ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఒకరిత ఆవర్తనం దీంతో పాటు ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపారు. ఉత్తరకొస్తా , దక్షిణ కోస్తా , రాయలసీమలో పలు జిల్లాల్లో తేలికపాటి మోస్తారు వర్షాలు పడతాయి అని అంటున్నారు. ఏపీలోని అధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఉభయ గోదావరి జిల్లాలు , కృష్ణ , గుంటూరు , ప్రకాశం చిత్తూరు , సత్యసాయి , అనంతపురం , తిరుపతి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం , శ్రీకాకుళం జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజలు చెట్లు కింద ఉన్న రాదని అన్నారు. వర్షాలు ప్రభావంతో గంటకు 30- 40 కిలోమీటర్ వేగంతో గాలులు వేస్తాయని తెలిపారు. ఒక్కో సమయంలో 50KM కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. రానున్న 5రోజులు పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏపీలో రైతులు అప్రమత్తంగా ఉండాలి అని అంటున్నారు. పంట పొలాలు జాగ్రత్త చేసుకోవాలి అని అంటున్నారు. ఉదయం ఎండలు సాయంత్రం వర్షాలు పడతాయని పొలంలో పంటలు ఉంటే జాగ్రత్తపరచుకోవాలని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh


