Raghu Rama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్‌పై మహిళలు దాడి..! కారులో కూర్చుంటే కూడా వదల్లేదు, వీడియో ఇదిగో | ట్రెండింగ్


Last Updated:

Raghu Rama Krishna Raju: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజుపై దాడి జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికి దాడికి యత్నించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజుతో పాటు ఆయన అనుచరులపై దాడి జరిగింది.

+

Raghu

Raghu Rama Krishna Raju

Viral Video: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజుపై దాడి జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికి దాడికి యత్నించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజుతో పాటు ఆయన అనుచరులపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన సేఫ్‌గా బయటపడినప్పటికీ ఆయన వర్గీయులు మాత్రం గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాములవారి కళ్యాణంలో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు ఊహించిన పరిణామం ఎదురైంది. అక్కడ ఒక వర్గం గోబ్యాక్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో మేకులు, రాళ్లతో జరిగిన దాడిలో రఘురాం కృష్ణంరాజు మినహా దాదాపు మందికి గాయాలు అయినట్లు తెలిసింది. అసలు ఈదాడి ఎందుకు జరిగింది..? రఘురాం కృష్ణంరాజు పై స్కెచ్ వేసింది ఎవరు..?

ఏపీ డిప్యూటీ స్పీకర్ పై ఎటాక్..

ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లాకు సంబంధించి ఆకివీడు పెదపాడు ప్రాంతంలో జరుగుతున్న రాములవారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు హాజరయ్యారు. ఒకసారిగా ఆయన కాన్వాయ్ ఆలయం వద్ద ఆగిన వెంటనే గో బ్యాక్ గో బ్యాక్ అంటూ ఒక వర్గానికి చెందిన మహిళలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఇలాంటి తరుణంలో డిప్యూటీ స్పీకర్ సెక్యూరిటీ , వ్యక్తిగత సిబ్బంది వారిని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగలేదు. హై సెక్యూరిటీ నడుమ రఘురాం కృష్ణంరాజు ఆలయానికి చేరుకుని రాములవారిని దర్శించుకుని వెంటనే కాన్వాయ్ లో కూర్చొన్నారు. అలాంటి సమయంలో కాన్వాయ్ కదలకుండా నినాదాలు చేశారు. ఇటువంటి తరుణంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి నెలకొంది మేకులు, రాళ్లతో రఘురామకృష్ణ అనుచరులను కూటమినేతలపై మరో వర్గం దాడి చేసిందంటూ స్థానికుల పేర్కొన్నారు. ప్రస్తుతం సమీప ఆసుపత్రిలో వారంతా చికిత్స పొందుతున్నారు.

అసలు రఘురామకృష్ణ టార్గెట్ ఎందుకయ్యారు..

ప్రస్తుతం ఆకివీడు సమీపన్న రాముల వారి కళ్యాణం జరుగుతున్న ప్రాంతంలో రామాలయం నిర్మించేందుకు రఘురాం కృష్ణంరాజు ముందుకు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. అయితే అక్కడున్న కొందరు రామాలయాన్ని వ్యతిరేకరిస్తున్నారు. ఆ రామాలయం కట్టాలని ప్రతిపాదించిన చోట ఎక్కువగా దళితులు ఉండటం, ఆ స్తలం కూడా దళితులకే చెందినదిగా వారు ఆందోళనకు దిగారు.

అసలు ఏం జరిగింది..

ఇలాంటి తరుణంలో ఆయన అక్కడికి రావడానికి చూసి ఆ వర్గం ఈ విధంగా దూసుకొచ్చిందంటూ కొందరు చెబుతున్నారు . ఏదేమైనా ఈ విషయంపై పోలీసులు కాస్త సీరియస్ గా ఉన్నట్లు అర్థమవుతుంది, ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఒక పార్టీ సపోర్ట్ తో వారు ఈ విధంగా చేస్తున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *