Last Updated:
Government Schools: ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
Government Schools: ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా విద్యాశాఖ అధికారులతో పదవ తరగతి విద్యార్థులకు వందరోజుల ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఇఓ బాబు రాజేంద్రప్రసాద్, సర్వ శిక్ష అభియాన్ పిడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
పిల్లలకు శుద్ధజలము ఇవ్వాలనే సంకల్పంతో పి ఎం శ్రీ అనే పథకం కింద ప్రభుత్వ పాటశాలలో ఏ లోటు ఉన్న సరే ఈ నెల చివరి లోపు యాప్ లో అప్లోడ్ పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూజిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఒకే సామాజిక–ఆర్థిక నేపథ్యం, ఒకే పాఠ్యసామగ్రి, ఒకే బోధనా విధానాలు ఉన్నప్పటికీ ఫలితాల్లో తేడాలు కనిపిస్తే దానికి ప్రధాన బాధ్యత హెడ్‌మాస్టర్లు మరియు ఉపాధ్యాయులదేనని తెలిపారు.పనితీరు లేని హెడ్‌మాస్టర్లను అవసరమైతే మార్చేందుకు వెనుకాడబోమని, ఈ విషయంలో ప్రజలు, తల్లిదండ్రులు, సమాజం మద్దతుతోనే నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా పదవ తరగతి ఫలితాలు తగ్గిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.పాఠశాలల్లో క్రమశిక్షణ అత్యంత కీలకమని, క్రమశిక్షణ లోపిస్తే మొత్తం వ్యవస్థ వైఫల్యంగా మారుతుందని కలెక్టర్ హెచ్చరించారు. పనితీరు బలహీనంగా ఉన్న సుమారు 25 నుంచి 30 శాతం పాఠశాలలను ప్రత్యేకంగా గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేపడతామని తెలిపారు. ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకొని బాధ్యతారహిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.అధిక గైర్హాజరు ఉన్న పాఠశాలలపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని, మండల స్థాయి అధికారులు—ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, ఇతర శాఖల అధికారులు—పాఠశాలలను సందర్శించి బోధన, హాజరు, ఫలితాలను పరిశీలించాలని ఆదేశించారు.
అద్భుత ఫలితాలు ఆశించడం లేదని, కానీ కనీసం 5 నుంచి 10 శాతం మెరుగుదల తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. పాఠశాలలో ఎలాంటి పంచాయతీలు ఉండకూడదని తెలిపారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తులను తీర్చిదిద్ద వలసిన బాధ్యత ఎంఈఓ లు, ఆయా పాఠశాల హెడ్మాస్టర్లు పైన ఉన్నదని తెలిపారు. ఎం ఇ ఓ ప్రతి బుధవారం, శుక్రవారం పాఠశాలను సందర్శించి, విద్యార్థుల ఆరోగ్య విషయాలపై, వివిధ సబ్జెక్టులలో వెనకబడిన సి, డి గ్రేడ్ విద్యార్థులను పురోగతిలో ఉండే విధంగా పాఠశాల హెడ్మాస్టర్ తో చర్చించి మంచి ఫలితాలు సాధించే విధంగా మీరు కృషి చేయాలని ఆదేశించారు.తొమ్మిదో తరగతి నుంచి విద్యార్థులకు సైన్స్, గణితం, ఆంగ్లం, హిందీ భాషలపై ప్రత్యేక శిక్షణ ఇప్పించవలసిందిగా ఆదేశించారు. జిల్లాలో PMSRI పథకం అమలులో భాగంగా అన్ని పాఠశాలలో మౌలిక వసతులు కల్పన కొరకు మార్చి 31వ తేదీ లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఆర్ ఓ ప్లాంట్ ద్వారా నాణ్యమైన నీరును అందించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేస్తానని. ఏ పాఠశాలలో నిరుపయోగంగా ఆర్ ఓ ఆర్ ప్లాంట్ సంబంధించి ఎంత అవసరమో నివేదికలు అందజేసినచో నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. సంబదిత ఎంఈఓ లు హెడ్మాస్టర్లు ప్రధాన బాధ్యత వహించాలని ఆదేశించారు.
విద్యార్థులను ఒత్తిడి గురి చేయకుండా బాధ్యతగా పనిచేయాలని తెలిపారు. ప్రతి ఒక్క టీచర్ పదో తరగతి విద్యార్థులను దత్తత తీసుకొని వారిని పరీక్షలలో మంచి ఫలితాలు వచ్చే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. తవణంపల్లి , వీకోట, బంగారుపాల్యం, నగిరి, యాదమర్రి, ఎస్ఆర్ పురం, జీడి నెల్లూరు , చిత్తూరు మున్సిపాలిటీ, రామ కుప్పం, MEO ల పనితీరును సమీక్షించారు, పాఠశాలలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని MEO లను ఆదేశించారు.
లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ మేళా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, లేటెస్ట్ కోర్సులు, స్కాలర్‌షిప్స్, విద్యకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో తెలుసుకోండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Andhra Pradesh
Feb 19, 2026 10:06 AM IST



