Peddi Movie: చరణ్ కటౌట్ చూసి ఫ్యాన్స్ పూనకాలు.. పెద్ది దెబ్బతో మెగా హీరోలు అందరూ మటాష్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఏపీలో అభిమానులు సేవా కార్యక్రమాలు, భారీ కేక్ కటింగ్, పెద్ది మూవీ పోస్టర్లతో సందడి చేస్తూ మాస్ అవతార్ పై భారీ ఆశలు వ్యక్తం చేశారు.

+

News18

News18

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఏపీలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన పేరుపై సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఆ జిల్లాలో నిర్వహించిన సేవాకార్యక్రమాలు ప్రత్యేకంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. భారీ కేక్ కటింగ్ తో పాటు పెద్ది సినిమాకు సంబంధించిన వాల్‌పోస్టర్ బ్యానర్‌గా వేసి సందడి చేశారు.

మండుటెండలో అందరి దాహాన్ని తీరుస్తూ చల్లని మజ్జిగ, కూల్ డ్రింక్స్ వంటివి అందజేస్తూ రామ్ చరణ్ అభిమానులు ఆ జిల్లాలో సందడి చేశారు. ఒకసారి రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఆయన అభిమానులు ఏమంటున్నారు? ఒకసారి క్లుప్తంగా చూద్దాం..

ఒకపక్క పెద్ద మూవీ సినిమా సందడి, మరో పక్క హీరో రామ్ చరణ్ పుట్టినరోజు రెండు కలిసి రావడంతో రామ్ చరణ్ అభిమానుల ఆనందాలకు అవధులేవని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక దర్శకుడు అందించారని చెప్పుకోవచ్చు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు బాబు దర్శకత్వంలో వస్తున్న పెద్ది మూవీకి సంబంధించి రామ్ చరణ్ గతంలో ఎన్నడూ చూడలేని విధంగా మాస్ అవతారంలో కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు.

కుస్తీ అంటే బ్యాట్‌తో బంతికి ఎదురెళ్లే ఆటకాదురా ప్రాణంతో చావుకి ఎదురెళ్లే ఆట అనే దర్శకుడి డైలాగ్స్ సైతం ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఈనేపథ్యంలో రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక బ్యానర్ ఏర్పాటు చేసి భారీ కేక్ కటింగ్ కార్యక్రమం కాకినాడ జిల్లా తుని పట్నంతో పాటు అనేక ప్రాంతాల్లో నిర్వహించారు.

ముఖ్యంగా ఆయన పేరుపై సేవా కార్యక్రమాల సైతం అభిమాన సంఘ నాయకులు సురేష్, రాజారమేష్, నాని వారి ఆధ్వర్యంలో జరిగాయి. ఒకపక్క ఎండల సైతం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో, చల్లటి మజ్జిగ, కూల్ డ్రింక్స్ వంటివి అభిమాన నటుడి పేరుపై రామ్ చరణ్ అభిమానులు చేశారు. ప్రధానంగా సినిమా విషయానికొస్తే ఈసారి మామూలుగా ఉండదంటూ అభిమానులు పేర్కొంటున్నారు.

గతంలో ఎన్నడూ చూడని విధంగా రామ్ చరణ్ కనిపిస్తూ అదిరిపోయే డైలాగ్స్ చెబుతుంటే తెలియని ఆనందం పొంగుకొస్తుందంటూ అభిమానులు పేర్కొంటున్నారు. సినిమాకు సంబంధించి కీలక డైలాగ్స్ సైతం బయటికి వినిపించడంతో రామ్ చరణ్ అభిమానులు డైలాగ్స్‌తో సందడి చేస్తున్నారు. ఈసారి రామ్ చరణ్ అంటే ఏంటో అందరూ చూస్తారు అంటూ సంభాషిస్తున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందటూ చిరంజీవి అభిమానులు సైతం పేర్కొన్నారు

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *