Last Updated:
Pawan Kalyan: మిగతా నేతలకూ పవన్ కళ్యాణ్‌కి ఒక ప్రధాన తేడా ఉంది. మిగతా వారు ప్రజల కోసం తమ సొంత డబ్బును ఖర్చు పెట్టేది చాలా తక్కువ. పవన్ కళ్యాణ్ మాత్రం.. సంపాదన అంతా.. ప్రజల కోసం వాడేస్తున్నారు. త్యాగశీలిలా మారిపోతున్నారు. తాజాగా ఏం చేశారో తెలుసుకుందాం.
రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనే పదవి లేదు. దానికి విలువే లేదు. వైసీపీ హయాంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ నో యూజ్. ఆ పదవులు పేరుకే అన్నట్లు ఉండేవి. ఇప్పుడు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు.. ఆ పదవికి వన్నె తెస్తున్నారు. తెలంగాణలో డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క తన మార్క్ చూపిస్తుంటే.. ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్.. నిరంతరం ప్రజా సేవలో ఉంటూ.. ఆ పదవికి తగిన గుర్తింపు తెస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆయన చాలా సంక్షేమ కార్యక్రమాల కోసం తన సొంత డబ్బును ఇచ్చేస్తున్నారు. ఇది మిగతా నేతలతో ఆయనను వేరు చేస్తోంది. అంతేకాదు ప్రజల్లో ఆయన పట్ల అభిమానాన్ని కూడా పెంచుతోంది. ఛాన్స్ దొరికితే అవినీతికి పాల్పడి.. ప్రజా ధనాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న నేతలు ఉన్న ఈ రోజుల్లో..
తాజాగా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టడంతో.. నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండలలోని కొణిదెల గ్రామంలో ఓ మంచి పని జరిగింది. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ ప్రకారమే.. ఈ గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. రూ.50 లక్షల విరాళం ఇచ్చి.. ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. ఇంకా ఇక్కడ ప్రభుత్వం ద్వారా రోడ్లు, ఇళ్లు, కాలువలు, డ్రెయిన్లు, గోకులాల నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వం ద్వారా ఈ గ్రామానికి రూ.6 కోట్లకు పైగా నిధులు వచ్చేలా చేశారు. అందువల్ల ఇవాళ కొణిదెల గ్రామం కళకళలాడుతోంది.
2019 సాధారణ ఎన్నికల టైంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు పవన్ కళ్యాణ్. ఆ టైంలో తమ గ్రామాన్ని దత్తత తీసుకోమని కొందరు పవన్ కళ్యాణ్‌ని కోరారు. పవన్ కళ్యాణ్ ఇంటి పేరు కొణిదెల. ఈ గ్రామం పేరు కూడా అదే. అందుకే స్థానికులు అలా కోరారు. ఈ ఆలోచన బాగానే ఉండటంతో.. దత్తత తీసుకుంటానని పవన్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత 2025లో ఓ కార్యక్రమం కోసం నందికొట్కూరుకి వచ్చిన పవన్ కళ్యాణ్.. అప్పుడే.. కొణిదెల గ్రామం అభివృద్ధి కోసం సొంతంగా రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. అప్పుడు ఊళ్లో తాగునీటి సమస్య బాగా ఉందని తెలిసింది. దాంతో.. అ డబ్బుని ఉపయోగించి 90,000 లీటర్ల తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. అది ఇప్పుడు పూర్తైంది. దీని ద్వారా 2 వేల మందికి తాగునీరు లభిస్తుంది.
శ్రీ @PawanKalyan గారి చొరవతో కొణిదెల గ్రామానికి మహర్దశ!
▪️ రూ. 50 లక్షల విరాళంతో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం, గ్రామ దాహార్తికి శాశ్వత పరిష్కారం
▪️ పల్లె పండగ, సాస్కీ, గ్రామీణ రహదారి సబ్ ప్లాన్ల ద్వారా రూ. 6 కోట్ల అభివృద్ధి పనులు
▪️ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కొణిదెల… pic.twitter.com/QU2ssq9cww
— JanaSena Party (@JanaSenaParty) February 21, 2026
ప్రభుత్వాలు ఇచ్చే పథకాలను సద్వినియోగం చేసుకుంటే.. ఎలాంటి మంచి ఫలితాలు వస్తాయో.. కొణిదెల గ్రామాన్ని చూస్తే అర్థమవుతుంది. ఈ గ్రామంలో కొత్తగా 3 రోడ్లు వచ్చాయి. త్వరలో 7 సీసీ రోడ్లు నిర్మించబోతున్నారు. ఇందుకు రూ.45లక్షలు ఖర్చు చెయ్యబోతున్నారు. ఇంకా.. గ్రామం నుంచి లక్ష్మాపురం వరకు 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు కోసం రూ.4 కోట్లు ప్రభుత్వం ద్వారా వచ్చాయి. 19 ఇళ్లు, 4 గోకులాలు, నీటితొట్టెలను ప్రభుత్వం నిర్మించింది. అలాగే రైతుల కోసం 49 ఫీడర్ ఛానల్స్ కూడా వచ్చాయి. 3 చెక్ డ్యామ్స్, 2 కాలువల్ని పునరుద్ధరించారు. ఇలా పవన్ కళ్యాణ్.. ఈ ఊరి ప్రజలు అడుగుతున్న ప్రతీ కోరికా తీర్చుతున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చుతూ.. ప్రభుత్వ పథకాలన్నీ ఇక్కడ అమలయ్యేలా చేస్తున్నారు. డీసీఎం చొరవతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



