Last Updated:
NTR Bharosa Pension: ప్రతినెల పెన్షన్ల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లబ్దిదారులకు వేలకోట్ల రూపాయలు ఇస్తోంది. అయితే ఏప్రిల్ పెన్షన్ల పంపిణీ భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా బత్తలపల్లి సచివాలయం పరిధిలో జరిగిన సంఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
NTR Bharosa Pension: ఒకటో తారీకు సెలవు వస్తే 31 వ తారీకే పెన్షన్ ఇచ్చే విధానం కేవలం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే జరుగుతుంది. అందులోనూ వృద్ధాప్య పించేన్ రూ.4,000 వికలాంగుల పెంచిన 6వేల రూపాయలు ఇలా పలు రకాల పెన్షన్లు ఇస్తోంది. వేలకోట్ల రూపాయలు ప్రతినెల పెన్షన్ల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తోంది. అయితే ఏప్రిల్ పెన్షన్ల పంపిణీ భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా బత్తలపల్లి సచివాలయం పరిధిలో జరిగిన సంఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పించన్ నగదు పంపిణీలో చిరిగిన నోట్లను అందజేస్తుండడంతో పించన్ లబ్ధిదారులు తిరస్కరించారు. బుధవారం బత్తలపల్లి 1,బత్తలపల్లి,2 నచివాలయల సిబ్బంది లబ్ధిదారులకు పింఛన్ నగదును పంపిణీ చేయడానికి వెళ్లారు. అయితే చిరిగిన 5వందల నోట్లను అందజేస్తుండడంతో లబ్దిదారులు వాటిని తిరస్కరించారు. పింఛన్ నగదును పంపిణీ చేయడానికి బ్యాం కు సిబ్బంది అందజేసిన నగదులో బత్తలపల్లి 1 సచివాలయంలో 50వేలు,బత్తలప ల్లి 2 సచివాలయలకు లక్ష రుపాయలు చిరిగిన నోట్లు అందడంతో ఆందోళన చెందిన సచివాలయ సిబ్బంది గురువారం చిరిగిన నోట్లు తీసుకొని ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లారు. అయితే అక్కడ మేనేజర్ నిర్భక్ష్యంగా మేము ఏమి చేస్తాము ఇక్కడ ఇవ్వము అనంతపురం వెల్లాలని సమాధానం ఇచ్చినట్లు సచివాలయ సిబ్బంది పేర్కొన్నారు.
ఇదే విషయాన్ని సచివాలయ సిబ్బంది ఎంపిడిఓ నరసింహనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఎస్బిఐ మేనేజర్‌కి పోన్ చేసి పించన్ లబ్దిదారులు పించన్ కోసం ఎదురుచూస్తున్నరని మీరు ఈ రోజు ఇవ్వకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకేల్తామని తెలిపారు. దీంతో మధ్యాహనం మేనేజర్ సచివాలయ సిబ్బందిని పిలిపించితిరిగి డబ్బులు ఇచ్చాడు. చిరిగిన నోట్లేకాకపట్టుకుంటేనే చిరిగి రాలిపోయే నోట్లు ఇవ్వడంపై పించన్ దారులు సచివాలయ నిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. అందులో ఒక నకిలీ నోటు వచ్చిందని సచివాలయ సిబ్బంది తెలిపారు.చిరిగిన నోట్లు ఇస్తే మేము తీసుకోవాలా అదే చిరిగిన నోట్లో మీకు జీతాల రూపంలో ఇస్తే మీరు తీసుకుంటారా అని బత్తలపల్లి ప్రాంతీయ పెన్షన్ దారులు మాట్లాడుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Anantapur,Anantapur,Andhra Pradesh
Apr 03, 2026 12:26 PM IST



